నచ్చినోడితో పెళ్లి వద్దన్నారని..

శేరిలింగంపల్లి(హైదరాబాద్), వెలుగు: తనకు నచ్చిన వాడిని కాదని తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తున్నారని ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. వరంగల్​కు చెందిన వరప్రసాద్ కూతురు తన్మయి(31) మియాపూర్​లో ఫిజియోథెరపిస్ట్​గా పనిచేస్తోంది. తమ్ముడితో కలిసి ఆర్‌బీఆర్​ కాంప్లెక్స్​లో ఉంటోంది. తను పనిచేసే చోట మరో ఫిజియోథెరపిస్ట్​ను ఇష్టపడుతున్నట్లు, అతడినే పెళ్లి చేసుకుంటానని ఇటీవల తల్లిదండ్రులతో చెప్పింది. దీనికి తన్మయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆమెకు వేరే సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని టైంలో ఫ్యాన్​కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది.

For More News..

ఇంటర్ ఇంగ్లిష్‌లో 5 తప్పులు.. ఆ తప్పులు ఇవే..

ఇంటికో ఉద్యోగం ఇస్తమని నేను ఎప్పుడూ అనలేదు

Latest Updates