నలుగురు పిల్లలుంటే నో ఇన్ కం ట్యాక్స్

  • మహిళలకు హంగేరీ ప్రధాని ఆఫర్
  • 7 సీటర్ కారుకు 6 లక్షల సబ్సిడీ
  • పెళ్లికి రూ.25 లక్షల లోన్
  • జనాభా పెరుగుదల కోసం పాట్లు

హంగేరీ మహిళలకు ఆ దేశ ప్రధాని విక్టర్ ఒర్బాన్ వినూత్నమైన ఆఫర్ ప్రకటించారు. నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే జీవితాంతం ఇక ఇన్ కం ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఈ విషయాన్ని విక్టర్ తన వార్షిక నేషనల్ అడ్రస్ మీట్ లో ప్రకటించారు. ఇదేం వింత నిర్ణయం… ఒక దేశ ప్రధాని ఇలాంటి ప్రకటన చేయడమేంటని అనుకుంటున్నారా?? అవును మరి.. ఆ దేశం జనాభా పెంచుకోవడానికి పాట్లు ఇవి. జనాభా పెరుగుదల కోసం మరిన్ని ప్రోత్సాహకాలను ఆయన ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చే వలసలపై ఆధారపడకుండా హంగేరీ భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలని ఆ దేశ ప్రజలకు విక్టర్ పిలుపునిచ్చారు.

ప్రపంచంలోనే అతి సంపన్న దేశాల్లో ఒకటైన హంగేరీ జనాభా 98.7 లక్షలు మాత్రమే.

ప్రకటనల్లో కొన్ని..

  • నలుగురి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలు ఇన్ ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు.
  • పిల్లలు ఎక్కువైతే చిన్న వాహనాలు సరిపోవు కదా. అలాంటి కుటుంబాలకు 7 సీట్ల కార్లు కొనుగోలు చేసేందుకు రూ.6.25 లక్షల సబ్సిడీ.
  • 40 ఏళ్ల లోపు వయసున్న మహిళల తొలి మ్యారేజీకి తక్కువ వడ్డీతో రూ.25 లక్షల లోన్.

Latest Updates