16వ అంతస్తుపై యువతి పోల్ డ్యాన్స్

రష్యాలో ఓ యువతి ఒళ్లు జలదరించే సాహసం చేసింది. 16 అంతస్తుల భవనం పైన పోల్ డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోల్ డ్యాన్స్ ప్రదర్శన మాస్కోలో చేసింది. దీనిని డ్రోన్ ద్వారా, గోప్రో కెమెరాల ద్వారా షూట్ చేశారు.

27 ఏళ్ల పోల్ డ్యాన్సర్ మరినా కోర్జెనెవ్‌స్కాయా అనే యువతి రష్యాలోని వోరోనెజ్‌లోని 16 అంతస్తుల బిల్డింగ్ పైకి ఎక్కింది. అక్కడ పోల్ డ్యాన్స్ చేసింది. ఒళ్లు జలదరించే ఈ ప్రదర్శనను గత ఏడాది ఆగస్ట్ నెలలో చేసింది. ఆ  వీడియోను ఇప్పుడు విడుదల చేశారు.

ఈమె 16వ అంతస్తు పైన పోల్ డ్యాన్స్ చేసినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 16వ అంతస్తు పైన ఆమె పోల్ డ్యాన్స్ చేసే ప్రాంతానికి కింది భాగంలో ఐరన్ రాడ్ లతో రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ఆమె సునాయాసంగా పోల్ డ్యాన్స్ చేసింది. కానీ అనుకోని ప్రమాదం జరిగితే పడిపోకుండా ఉండేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

Latest Updates