మహిళా రోబో న్యూస్ రీడర్

ఖ్వాయ్ హావో గుర్తున్నాడా? అదేనండీ.. గత ఏడాది చైనా ప్రపంచానికి  పరిచయం చేసిన మగ రోబో న్యూస్ రీడర్. గుర్తొచ్చాడా? ఇప్పుడీ రోబో న్యూస్ రీడర్ గురించి ఎందుకంటారా ? కారణం ఉంది.. అప్పుడు మగ రోబో న్యూస్ రీడర్ ను తీసుకొస్తే , ఇ ప్పుడు మహిళా రోబో న్యూస్ రీడర్ ను ప్రపంచానికి చూపించింది.అవును, చైనా అధికా రిక న్యూస్ చానెల్ షిన్హువా న్యూస్ ఏజెన్సీలో ఈ ఆడ రోబో న్యూస్ రీడర్ ..చకచకా వార్తలను చదివేయనుంది మరి. దాని పేరు షిన్ షియా వోమెంగ్ . చైనా సెర్చ్​ ఇంజన్ షౌగౌ కంపెనీతో ఈ ఏఐ రోబోను తయారు చేయించింది షిన్ హువా.మంగళవారం దానికి అపాయింట్​మెంట్ ఇచ్చేశారు. మార్చిలో జరిగే చైనా వార్షిక పార్లమెంటరీ సమావేశాలనుం చి షియా వోమెంగ్  డ్యూటీకెక్కనుంది. అయినా ఏఐ రిపోర్టర్ లు, జర్నలిస్టుల మీద ఆ దేశం చేస్తున్న ప్రయోగం ఇప్పటిది కాదు లెండి. 2012లోనే దానిపై పని మొదలుపెట్టింది. యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.. జియాజియా అనే ఆడ రోబో జర్నలిస్టును తయారు చేసిం ది. 2017లో వైర్డ్​ అనే సంస్థ కో ఫౌండర్ కెవిన్ కెల్లీని అది ఇంటర్వ్ యూ చేసిం ది. షిన్హువా ఆ ఇంటర్వ్ యూను రికార్ డు చేసింది.

Latest Updates