నేడు మహిళల టీ 20 చాలెంజ్ ఫైనల్.. వెలాసిటీ vs నోవాస్

తొలి సారి పూర్తి స్థాయి టోర్నమెంట్‌లా నిర్వహిస్తున్న మహిళల టీ20 చాలెంజ్‌ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మూడు లీగ్‌ మ్యాచ్‌ లు అభిమానులను మురిపించగా..ఇప్పుడు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చేందుకు మిథాలీ రాజ్‌ , హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ బృందాలు రెడీ అయ్యాయి. శనివారం ఇక్కడి సవాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియంలో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ లో వెలాసిటీ, సూపర్‌ నోవాస్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్‌ దశలో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ లో గెలిచాయి. తొలి మ్ యాచ్‌ లో స్మృతిమంధాన కెప్టెన్సీలోని ట్రయల్‌ బ్లేజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడిపోయిన నోవాస్‌ .. గతపోరులో వెలాసిటీపై
విజయం సాధించింది. బ్లేజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై నెగ్గిన మిథాలీబృందం చివరి లీగ్‌ లో నోవాస్‌ చేతిలో ఓడినా మెరుగైన రన్‌ రేట్‌ తో ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు చేరుకుంది. సూపర్‌ నోవాస్‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఉండగా.. వెలాసిటీ జట్టులో డానియెల్‌ వ్యాట్‌ జోరు మీద కనిపిస్తోంది. బౌలింగ్‌ లో వెలాసిటీ ఫేసర్‌ అమేలియా కెర్‌నాలుగు వికెట్లతో సం యుక్తం గా టాప్‌ ప్లేస్‌ లో ఉండగా.. రాధా యాదవ్‌ (నోవాస్‌ ) మూడు వికెట్లతో సెకండ్‌ ప్లేస్‌ లో కొనసాగుతోం ది. మొత్తంగా అన్ని విభాగాల్లో ఇరు జట్లూ సమ ఉజ్జీలుగా ఉన్నాయి. మరి, ట్రోఫీ ఎవరి సొంతం అవుతుందో చూడాలి.