తడబ్యాటు: ఫైనల్లో ఓడిన భారత్

ఉమెన్స్ టీ20లో చిత్తుగా ఓడింది భారత్. మెల్ బోర్న్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇండియాపై 85 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ లో ఓటమెరుగని భారత్.. ఫైనల్స్ లో మాత్రం కనీసం పోటీ ఇవ్వకుండా ఓడింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. 30 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

టీమిండియా బ్యాటింగ్‌​ ప్రారంభమైన మూడో బంతికే షఫాలీ వర్మ(2) పెవిలియన్‌ బాట పట్టింది. మెగాన్‌ షూట్‌ వేసిన బంతిని అంచనా వేడంలో విఫమైన షఫాలీ కీపర్‌ క్యాచ్‌ ఔట్‌ వెనుదిరిగారు. ఈ క్రమంలో అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన తానియా భాటియా (2 రిటైర్డ్‌ హర్ట్‌) గాయం కారణంగా మైదానాన్ని వీడింది. ఆ తర్వాత వచ్చిన వారెవరూ రాణించలేక పోవడంతో విక్టరీ ఆసిస్ ను వరించింది.

Latest Updates