షెడ్యూల్‌‌ ఇదే: అమ్మాయిల టీ20 వరల్డ్‌ కప్‌

రేపటి నుంచే టీ20 వరల్డ్‌ కప్‌

క్రికెట్‌‌లో అబ్బాయిలకు పోటీగా అన్నింటా అదరగొడుతున్న అమ్మాయిలు.. తమ ధనాధన్‌‌ ఆటతో ఫ్యాన్స్‌‌కు కిక్‌‌ ఇచ్చేందుకు రెడీ అయ్యారు..! 2009లో మొదలై ప్రతీ సీజన్‌‌కు క్రేజ్‌‌ పెంచుకుంటూ వస్తున్న మహిళల టీ20 వరల్డ్‌‌ కప్‌‌ ఏడో ఎడిషన్‌‌లో  పది దేశాల క్రికెటర్లు ఢీ అంటే ఢీ అంటున్నారు..! రికార్డు స్థాయిలో నాలుగుసార్లు కప్పు నెగ్గిన ఆసీస్‌‌.. సొంతగడ్డపై పాంచ్‌‌ పటాకా కొట్టాలని చూస్తుండగా.. భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న ఇండియా తొలిసారి కప్పు కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది..! శుక్రవారం మొదలై వచ్చే నెల 8 వరకు అభిమానులకు కనువిందు చేయబోయే ఈ టోర్నీ విశేషాలివి..

ఏ గ్రూప్‌‌లో ఎవరు

గ్రూప్‌‌-ఎ: ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌‌.
గ్రూప్‌‌-బి: ఇంగ్లండ్‌‌, పాకిస్థాన్‌‌, వెస్టిండీస్‌‌,
సౌతాఫ్రికా, థాయ్‌‌లాండ్‌‌.

ఫార్మాట్‌‌ ఇలా

టోర్నీలో పది జట్లు పోటీ పడుతున్నాయి. వీటిని ఐదేసి జట్ల చొప్పున రెండు గ్రూప్‌‌లుగా విభజించారు. గ్రూప్‌‌ దశలో రౌండ్‌‌ రాబిన్‌‌ పద్ధతిలో ప్రతి జట్టు గ్రూప్‌‌లో మిగతా నాలుగు జట్లతో పోటీ పడుతుంది. రెండు గ్రూప్స్‌‌లో టాప్‌‌-–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌‌కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌‌లు జరుగుతాయి.

థాయ్‌‌లాండ్‌‌ జట్టు తొలిసారి వరల్డ్‌‌కప్‌‌కు క్వాలిఫై అయింది. గత టోర్నీ ఆడిన పది జట్లలో టాప్‌‌–8లో నిలిచిన జట్లు నేరుగా అర్హత సాధించగా.. వరల్డ్‌‌ టీ20 క్వాలిఫయర్స్‌‌ టోర్నీలో విజేతగా నిలిచిన బంగ్లాదేశ్‌‌తో పాటు రన్నరప్‌‌ మిగతా రెండు బెర్తులు దక్కించుకున్నాయి.

ఈ టోర్నీలో ఇప్పటిదాకా రెండు సెంచరీలు మాత్రమే వచ్చాయి. ఆసీస్‌‌ క్రికెటర్‌‌ మెగ్‌‌ లానింగ్‌‌ 2014 వరల్డ్‌‌కప్‌‌లో ఐర్లాండ్‌‌పై సెంచరీ కొట్టగా.. ఇండియా కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ గత ఎడిషన్‌‌లో న్యూజిలాండ్‌‌పై సెంచరీ కొట్టింది.

ఇప్పటిదాకా ఆరు టోర్నీలు జరిగితే మూడు జట్లు మాత్రమే కప్పు నెగ్గాయి. ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో 4సార్లు నెగ్గితే.. ఇంగ్లండ్‌‌ (2008),       వెస్టిండీస్‌‌ (2016) ఒక్కోసారి విజేతగా నిలిచాయి.

టీ20 వరల్డ్‌‌కప్స్‌‌లో న్యూజిలాండ్‌‌ క్రికెటర్‌‌ సుజీ బేట్స్‌‌ అత్యధికంగా 881  రన్స్‌‌ చేసింది. ఆరు ఎడిషన్లలో పోటీ పడ్డ ఆమె 28 ఇన్నింగ్స్‌‌ల్లో 33.88 యావరేజ్‌‌తో ఇన్ని రన్స్‌‌ చేసింది. స్ట్రయిక్‌‌ రేట్‌‌ 115.61. ఆమె ఖాతాలో ఆరు హాఫ్‌‌ సెంచరీలు ఉన్నాయి. వెస్టిండీస్‌‌ కెప్టెన్‌‌ స్టెఫానీ టేలర్‌‌ (797), ఇంగ్లండ్‌‌ క్రికెటర్‌‌ షార్లొట్‌‌ ఎడ్వర్డ్స్‌‌ (768), మిథాలీ రాజ్‌‌ (726) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సుజీ, స్టెఫానీ ఈ టోర్నీలోనూ ఆడుతున్నారు.

ఈ టోర్నీలో ఆస్ట్రేలియా బౌలర్‌‌ ఎలైస్‌‌ పెర్రీ అందరికంటే ఎక్కువగా 36 వికెట్లు పడగొట్టింది. ఇంగ్లండ్‌‌ క్రికెటర్‌‌ ష్రబ్‌‌సోల్‌‌ 33 వికెట్లతో సెకండ్‌‌ ప్లేస్‌‌లో ఉంది. ఇండియా నుంచి పూనమ్‌‌ యాదవ్‌‌ 18 వికెట్లతో టాప్‌‌లో ఉంది. గత రెండు టోర్నీల్లో ఆడిన ఆమె ఈసారి కూడా బరిలో ఉంది.

ఆసీస్‌‌దే ఆధిపత్యం

ధనాధన్‌‌ ఫార్మాట్‌‌ అత్యుత్తమ సమరంలో ఆస్ట్రేలియాదే పూర్తి ఆధిపత్యం. ఆరు టోర్నీల్లో ఆ జట్టు ఏకంగా నాలుగుసార్లు విజేతగా నిలిచింది. తొలి ఎడిషన్‌‌ తప్ప మిగతా ఐదు సార్లు ఫైనల్‌‌కు వచ్చిందంటే ఆ జట్టు ఎంత గొప్పగా ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు 2010 నుంచి 2014 వరకు వరుసగా మూడు టోర్నీల్లో విజేతగా నిలిచి హ్యాట్రిక్‌‌ సాధించింది. ఇక, ఓవరాల్‌‌గా అన్ని ఎడిషన్లలో కలిపి 32 మ్యాచ్‌‌లు ఆడిన కంగారూలు 24 గెలిచి,  ఏడింటిలో మాత్రమే ఓడిపోయారు. అత్యధికంగా 76.56 విన్‌‌ పర్సెంటేజ్‌‌ ఆ జట్టు సొంతం. తొలి టోర్నీ చాంపియన్​ ఇంగ్లండ్‌‌ 29 మ్యాచ్‌‌ల్లో 21 విజయాలు సాధించి 74.13 శాతంతో సెకండ్‌‌ ప్లేస్‌‌లో ఉంది. న్యూజిలాండ్‌‌ (28 మ్యాచ్‌‌ల్లో 20 విజయాలు) 71.42తో థర్డ్‌‌ బెస్ట్‌‌ విన్నింగ్‌‌ పర్సంటేజ్‌‌ ఉన్నప్పటికీ ఆ జట్టు కప్పు నెగ్గలేకపోయింది. 2009, 2010లో రన్నరప్‌‌తో సరిపెట్టింది. ఇండియా 26 మ్యాచ్​లు ఆడి 13 విజయాలు మాత్రమే సాధించింది.

సెమీఫైనలే ఇండియా బెస్ట్‌‌

ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియాకు మంచి రికార్డు లేదు. మొదటి ఎడిషన్‌‌ నుంచి బరిలోకి దిగుతున్నా ఇండియా కప్పు అందుకోలేకపోయింది. అంతేకాదు ఒక్కసారి కూడా ఫైనల్‌‌ చేరలేదు. సెమీఫైనలే బెస్ట్‌‌ పెర్ఫామెన్స్‌‌. తొలి రెండు ఎడిషన్లలో (2009, 10) సెమీస్‌‌ చేరిన అమ్మాయిలు తర్వాతి మూడు టోర్నీల్లో గ్రూప్‌‌ దశలోనే ఇంటిదారి పట్టారు. గత ఎడిషన్‌‌లో అద్భుత ఆటతో మూడో సారి సెమీస్‌‌కు దూసుకొచ్చినా.. ఇంగ్లండ్‌‌ చేతిలో ఓడి నిరాశ పరిచారు. లెజెండరీ ప్లేయర్లు మిథాలీ రాజ్‌‌, జులన్‌‌ గోస్వామి లేకుండా బరిలోకి దిగుతున్న ఇండియా ఈసారి కప్పు నెగ్గాలని ఆశిస్తోంది. అయితే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌తో కూడిన బలమైన గ్రూప్‌‌లో ఉన్న హర్మన్‌‌ప్రీత్‌‌ అండ్​ కోకు కఠిన సవాల్‌‌ ఎదురవనుంది.

టీ20 వరల్డ్​ కప్​ షెడ్యూల్‌‌

తేదీ          మ్యాచ్‌‌                               వేదిక             సమయం

21           ఇండియాxఆస్ట్రేలియా          సిడ్నీ             మ. 1.30

22           థాయ్‌‌లాండ్‌‌xవెస్టిండీస్‌‌       పెర్త్‌‌                మ.12.30

22           న్యూజిలాండ్‌‌xశ్రీలంక           పెర్త్‌‌                సా. 4.30

23           ఇంగ్లండ్xసౌతాఫ్రికా            పెర్త్‌‌                సా. 4.30

24           ఆస్ట్రేలియాxశ్రీలంక              పెర్త్‌‌                ఉ. 11.30

24           ఇండియాxబంగ్లాదేశ్‌‌           పెర్త్‌‌                సా. 4.30

26           ఇంగ్లండ్‌‌xథాయ్‌‌లాండ్‌‌         కాన్‌‌బెర్రా         ఉ. 9.30

26           పాకిస్థాన్‌‌xవెస్టిండీస్​            కాన్‌‌బెర్రా         మ.1.30

27           ఇండియాxన్యూజిలాండ్‌‌      మెల్‌‌బోర్న్‌‌      ఉ. 9.30

27           ఆస్ట్రేలియాxబంగ్లాదేశ్‌‌          కాన్‌‌బెర్రా         మ. 1.30

28           సౌతాఫ్రికాxథాయ్‌‌లాండ్‌‌      కాన్‌‌బెర్రా         ఉ. 9.30

28           ఇంగ్లండ్‌‌xపాకిస్థాన్‌‌             కాన్‌‌బెర్రా         మ. 1.30

29           బంగ్లాదేశ్‌‌xన్యూజిలాండ్‌‌       మెల్‌‌బోర్న్‌‌      ఉ. 5.30

29           ఇండియాxశ్రీలంక               మెల్‌‌బోర్న్‌‌      మ. 1.30

మార్చి1   పాకిస్థాన్‌‌xసౌతాఫ్రికా           సిడ్నీ             ఉ. 9.30

1             ఇంగ్లండ్‌‌xవెస్టిండీస్‌‌             సిడ్నీ             మ. 1.30

2             బంగ్లాదేశ్‌‌xశ్రీలంక                మెల్‌‌బోర్న్‌‌      ఉ. 5.30

2             ఆస్ట్రేలియాxన్యూజిలాండ్‌‌     మెల్‌‌బోర్న్‌‌      ఉ. 9.30

3             పాకిస్థాన్‌‌xథాయ్‌‌లాండ్‌‌       సిడ్నీ             ఉ. 9.30

3             సౌతాఫ్రికాxవెస్టిండీస్‌‌           సిడ్నీ             మ. 1.30

5             ఫస్ట్‌‌ సెమీఫైనల్‌‌                 సిడ్నీ             ఉ. 9.30

5             సెకండ్‌‌ సెమీఫైనల్              సిడ్నీ             మ. 1.30

8             ఫైనల్‌‌                                మెల్‌‌బోర్న్‌‌      మ. 12.30

అన్ని మ్యాచ్‌‌లు ఇండియా టైమ్‌‌ ప్రకారం స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో  లైవ్‌‌

Latest Updates