కేంద్రం క్లారిటీ: టెస్ట్ కిట్లకు మనీ చెల్లించలేదు.. లాస్ ఎలా అవుతాం

కోవిడ్ – 19 రాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్ ధరల వివాదంపై కేంద్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది. చైనా కంపెనీలనుంచి… కోవిడ్ -19  రాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్ ల సరఫరాకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చర్ ( ICMR) ఎటువంటి చెల్లింపులు జరుపలేదని తెలిపింది. దీంతో పాటు ఈ కిట్ లకోసం టెండర్లను కూడా పిలిచామని చెప్పింది కేంద్రం. ఆర్డర్ కోసం రూ.1,204 నుంచి 600 రూపాయల మధ్య బిడ్లు అందుకున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఈ కిట్లలో పెద్దమొత్తంలో అవినీతి జరిగిందని ఆరోపనలు చేయగా.. కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇంకా తాము చైనాకు మనీ చెల్లించలేదని తెలిపింది. కిట్లు నాసిరకంగా ఉండటంతో వాటిని వెనక్కి పంపించామని చెప్పింది.

రెండు చైనా కంపెనీల నుంచి రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్లు భారత్ కు వచ్చాయని అయితే వాటిని పరిశీలించగా నాసిరకంగా ఉన్నాయని కనుక్కున్నామని చెప్పింది కేంద్రం. దీంతో చైనా వాళ్లు పంపిన కిట్లను వెనక్కి పంపించామని తెలిపారు. ఈ ఉత్తర్వులను రద్దుచేయడం వలన భారత్ ధనాన్ని కోల్పోలేదని చెప్పింది.

రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్లలో భారీ కుంభకోనం జరిగిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించగా… ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కేంద్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. 245రూపాయలకు దిగుమతి చేసుకున్న కిట్లను… 600రూపాయలకు ఎలాఅమ్ముతున్నారని ట్వీట్ చేశారు. ఇందుకు గాను కేంద్రం బదులిచ్చింది.

Latest Updates