వ్యాక్సిన్ వచ్చినా నేనైతే వేయించుకోను

రియో డీ జెనీరియో: కరో్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా తాను మాత్రం టీకా వేయించుకోబోనని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో అన్నారు. ఇప్పటికే పలుమార్లు కరోనా వ్యాక్సిన్‌‌‌‌తోపాటు మాస్క్ కట్టుకోవడంపై దాటవేత ధోరణిలో మాట్లాడిన బొల్సొనారో.. మరోమారు టీకాపై కామెంట్స్ చేశారు. ‘నేను మీకు ఒక్కటే చెబుతున్నా.. నేను వ్యాక్సిన్ తీసుకోబోను. అది నా హక్కు’ అని బొల్సొనారో చెప్పారు. గతంలో ఒకసారి బొల్సొనారో మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా బ్రెజిలియన్లకు టీకా చేయించాల్సిన అవసరం లేదన్నారు. ఈ కుక్కకు తప్ప ఎవ్వరికీ వ్యాక్సినేషన్ అవసరం లేదని బొల్సొనారో ట్వీట్ చేయడం గమనార్హం. ప్రపంచంలో కరోనా మృతుల విషయంలో యూఎస్‌‌ తర్వాత స్థానంలో బ్రెజిల్ ఉంది.

Latest Updates