స్టేట్ బ్యాంక్ లో వర్క్ ఫ్రం ఎనీవేర్

స్టేట్ బ్యాంక్ సిబ్బంది ఎక్కడి నుంచైనా పని చేసే లా కొత్త పాలసీ

త్వరలో వర్క్ ఫ్రం ఎనీవేర్ పాలసీని తేనున్న బ్యాంక్‌

రూ.వెయ్యి కోట్లు ఆదా అవుతుందని అంచనా

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పాలసీని త్వరలోనే తీసుకురాబోతోంది. ఈ పాలసీ ద్వారా ఉద్యోగులు ఏ ప్రాంతంలో నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్‌‌కు దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. కరోనా వైరస్ కారణంతో, తన కస్టమర్ల ప్రయోజనార్థం కాంటాక్ట్ లెస్ డిజిటల్ బ్యాంకింగ్‌‌పై ఎస్‌‌బీఐ ఫోకస్ చేసింది. దీని కోసం చాలా కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. గ్లోబల్‌‌గా అమలవుతోన్న ఉన్నత విధానాలను అమలు చేయడంలో భాగంగా బ్యాంక్‌‌ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్(డబ్ల్యూఎఫ్‌‌ఏ) ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను క్రియేట్ చేయనుందని, ఏ లొకేషన్‌‌ నుంచైనా ఉద్యోగులు పనిచేసేలా అవకాశం కల్పించబోతోందని  65వ యాన్యువల్ జనరల్ మీటింగ్‌‌లో ఎస్‌‌బీఐ ఛైర్మన్ రజ్‌‌నీష్ కుమార్ చెప్పారు. దీంతో వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను ఉద్యోగులకు అందించనున్నట్టు తెలిపారు.

వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పాలసీ ద్వారా రూ. వెయ్యి కోట్ల వరకు ఆదా చేయొచ్చని రజ్‌‌నీష్ కుమార్ చెబుతున్నారు. కరోనా టైమ్‌‌లో వ్యాపారాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగించడానికి ఇది కీలక కాంపోనెంట్‌‌గా ఉన్నట్టు పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో కాంటాక్ట్ లెస్ డిజిటల్ బ్యాంకింగ్‌‌ ఛానల్‌‌పై ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలిపారు. ఎస్‌‌బీఐ యోనో ఇప్పటికే వాలెట్‌‌ షేరును పెంచుకుని, తన డిజిటల్ ఛానల్ ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించిందని బ్యాంక్ ఛైర్మన్ చెప్పారు.యోనోను మరింత విస్తరించాలని ఎస్‌‌బీఐ ప్లాన్ చేస్తోంది. వచ్చే ఆరు నెలల్లో యూజరు రిజిస్ట్రేషన్‌‌ను రెండింతలు చేయాలని బ్యాంక్ టార్గెట్‌‌గా పెట్టుకుంది.

ఎండ్ టూ ఎండ్ హోమ్ లోన్స్ ఆఫర్, ప్రీ అప్రూవ్డ్ కారు లోన్, పర్సనల్ గోల్డ్ లోన్ వంటి కొత్త ప్రొడక్ట్ ఆఫరింగ్స్ ద్వారా మరింతగా ఈ యాప్‌‌ను బలోపేతం చేయాలని బ్యాంక్ చూస్తోంది. కస్టమర్ సౌకర్యార్థం ఎస్‌‌బీఐ యోనో యాప్‌‌లోనే కస్టమర్ సర్వీస్ పాయింట్ల వద్ద యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఏటీఎం కార్డులు అవసరం లేకుండానే యోనో యాప్ ద్వారా సీఎస్‌‌పీ అవుట్‌‌లెట్ ద్వారా క్యాష్ విత్‌‌డ్రాయల్ సౌకర్యం, ఇంటి వద్దనే క్యాష్ పికప్, క్యాష్ డెలివరీ, ఇంటి వద్దనే చెక్ పికప్ వంటి సౌకర్యాలను తీసుకొచ్చినట్టు ఎస్‌‌బీఐ ఛైర్మన్ తెలిపారు. ఆస్తులు, డిపాజిట్లు, బ్రాంచ్‌‌లు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా ఎస్‌‌బీఐ దేశంలోనే అతిపెద్ద కమర్షియల్ బ్యాంక్. ఇండియాలో ఎస్‌‌బీఐకి 22 వేలకు పైగా బ్రాంచ్‌‌లున్నాయి.

Latest Updates