వారం రోజులు ఇసుకలో కూరుకుపోయినా బతికాడు

ఓడిశాలో ఇసుకలో కూరుకుపోయిన ఓ యువకుడు వారం రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడు. అనుగుల్‌ జిల్లా చండిపద ప్రాంతంలో స్వచ్ఛభారత్ పథకం కింద మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. అక్కడ ఝార్ఖండ్‌కు చెందిన షేక్‌ బరజా అనే  కార్మికుడు పని చేస్తున్నాడు. జూలై 19 ఉదయం  అతడు  ఊరి చివర ఏటి గట్టు వద్ద టాయిలెట్ కు వెళ్లాడు. ఆ సమయంలో  అక్కడ ఉన్న ఇసుక గట్టు ఒక్కసారిగా కూలడంతో అతను ఆ ఇసుకలో కూరుకుపోయాడు. తల తప్ప బాడీ మొత్తం అందులో కప్పుకు పోయింది.అతను ఎంత అరిచినా ఎవరూ లేకపోవడంతో అలానే వారం రోజుల పాటు ఉన్నాడు. తర్వాతి రోజు మరుగుదొడ్లు నిర్మిస్తున్న కాంట్రాక్టర్ ఎంత వెతికినా అతను కనిపించలేదు. జూలై 26న కొందరు పెద్ద మనుషులు ఏటి గడ్డ వద్ద కనిపించగా వారిని చూసిన షేక్ బరజా కేకలు వేశాడు. వారు పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. అతన్నిబయటకు తీసి ఆస్పత్రిలో చేర్చించారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు.

Latest Updates