ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు

ఆర్టీసీ యాజమాన్యానికి టీఎంయూ సమ్మె నోటీసు ఇచ్చింది. ఇప్పటికే TJMU, EU, SWF సమ్మె నోటీసును ఇచ్చేశాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని TMU ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 25 తర్వాత ఏ క్షణంలోనైనా సమ్మెలోకి వెళ్తామన్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్  బస్ భవన్ లో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మకు సమ్మె నోటీసులు అందజేశారు అశ్వత్థామరెడ్డి.

Latest Updates