ఇండియా ఆర్చర్లకు గుడ్‌‌ న్యూస్‌‌

ఆర్చరీ అసోసియేషన్​పై సస్పెన్షన్‌‌ ఎత్తివేత

కోల్‌‌కతా: టోక్యో ఒలింపిక్స్‌‌కు ప్రిపేర్‌‌ అవుతున్న ఇండియా ఆర్చర్లకు గుడ్‌‌ న్యూస్‌‌. ఇండియా ఆర్చరీ అసోసియేషన్​ (ఏఏఐ)పై విధించిన నిషేధాన్ని వరల్డ్‌‌ ఆర్చరీ (డబ్ల్యూఏ) కొన్ని షరతులతో గురువారం ఎత్తి వేసింది. నేషనల్‌‌ ఆర్చరీకి ఎన్నికలు జరిగిన వారంలోపే తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. తమ ఎగ్జిక్యూటివ్‌‌ బోర్డు పోస్టల్‌‌ ఓటుతో ఇండియాపై సస్పెన్షన్‌‌ను ఎత్తివేయాలని నిర్ణయించినట్టు ప్రకటించిన డబ్ల్యూఏ.. అథ్లెట్‌‌ మెంబర్‌‌షిప్‌‌కు సంబంధించి రాజ్యాంగ సవరణ చేసుకోవాలని ఏఏఐకి సూచించింది. అలాగే, పాలనాపరమైన సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు వ్యూహాత్మక ప్రణాళికను అభివృద్ధి చేసుకోవాలని చెప్పింది. ఈ విషయాలపై క్వార్టర్లీ ప్రోగ్రెస్‌‌ రిపోర్ట్‌‌ (త్రైమాసిక పురోగతి) ఇవ్వాలని స్పష్టం చేసింది. ఏఏఐపై నిషేధం తొలగిపోవడంతో మన ఆర్చర్లు ఇకపై ఇండియా జెండా కింద బరిలోకి దిగనున్నారు.

Latest Updates