వరల్డ్ బ్యాంకు చీఫ్ గా మాల్పాస్..!

ప్రపంచబ్యాంకు నూతన చీఫ్ పదవికి ప్రముఖ ఎకానమిస్ట్ డేవిడ్ మాల్పాస్ (62)ను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. డాలర్లను సరిగా ఖర్చు చేస్తూ, అమెరికా ఇంట్రెస్ట్ లకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. దీంతో ప్రపంచ దేశాలకు సాయం చేసే వరల్డ్ బ్యాంకు పాత్రను ట్రంప్ శాసిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మాల్పాస్ ట్రంప్ కు సన్నిహితుడు. 2016 అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కు సీనియర్ ఎకానమిక్ అడ్వైజర్ గా పని చేశారు. ఓ ఎకానమిస్టు గా ప్రపంచ బ్యాంకు  నిర్ణయాలను చాలా సార్లు విమర్శించారు. ప్రస్తుం అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్‌లోని అంతర్జాతీయ సంబంధాల విభాగంలో సెక్రటరీగా పని చే స్తున్నారు. ట్రంప్ నామినేషన్ తో పాటు ఇతర దేశాల నామినేషన్లను వరల్డ్ బ్యాంకు డైరెక్టర్ల గ్రూపు పరిశీలిస్తుంది. అన్ని విధాల అర్హుడైన వ్యక్తిని బ్యాంకు చీఫ్ గా ఎన్నుకుంటుంది.

Latest Updates