అందుకే ప్రపంచబ్యాంకు అమరావతికి అప్పు ఇవ్వలేదట

world-bank-reject-300-million-to-amravati

అమరావతికి 300 మిలియన్ డాలర్ల రుణం రద్దుపై స్పందించింది ప్రపంచ బ్యాంకు. టీడీపీ ప్రభుత్వంలో బలవంతపు భూసేకరణ చేశారని అమరావతి రైతులు, స్వచ్చంద సంస్థలు ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదు చేశారు.. దీంతో అప్పుడే క్షేత్రస్థాయి విచారణ జరిపింది ప్రపంచబ్యాంకు. ఇందుకు గాను… గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరిపిన తర్వాతే రుణం ఇస్తామంటూ రాష్ట్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ విషయంపై.. జగన్ ప్రభుత్వం కేంద్రానికి వివరణ ఇచ్చింది.

ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడంలేదంటూ కేంద్రానికి జగన్ ప్రభుత్వం తెలిపింది. దీంతో అమరావతి భూసేకరణపై విచారణ జరుపొద్దంటూ ప్రపంచబ్యాంకుకు కేంద్రం ఉత్తరం రాసింది. అమరావతి భూసేకరణపై విచారణ జరిపిస్తే ఆ ప్రభావం దేశంలోని మిగిలిన ప్రాజెక్టులపైనా పడుతుందని లెటర్ లో తెలిపింది. కేంద్రం రాసిన లేఖను ఆధారంగా తీసుకుని అమరావతికి రుణ ప్రతిపాదననే ప్రపంచబ్యాంకు రద్దు చేసింది.

Latest Updates