జైపూర్​లో భారీ‌ క్రికెట్ స్టేడియం

న్యూఢిల్లీ: ఇండియాలో మరో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. 75 వేల సీటింగ్ కెపాసిటీతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్​సీఏ) స్టేడియం నిర్మాణానికి ప్లాన్ చేసింది. ఇందు కోసం రూ.550 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా నిలవనుంది. జైపూర్​కు 25 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ హైవేలో 100 ఎకరాల స్థలంలో ఈ స్టేడియంను నిర్మిస్తున్నామని ఆర్​సీఏ సెక్రటరీ మహేంద్ర శర్మ ప్రకటించారు. మరో నాలుగు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించి, రెండేళ్లలో స్టేడియంను అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. క్రికెట్ ఫెసిలిటీస్​తోపాటు ఇండోర్​ గేమ్స్​, ట్రెయినింగ్ అకాడమీలు, క్లబ్ హౌస్​, 4000 వాహనాలు సరిపడే పార్కింగ్ లాట్ వంటి సదుపాయాలు ఇందులో ఉంటాయని చెప్పారు. 1.10 లక్షల కెపాసిటీతో ఈ మధ్యే నిర్మితమైన ఇండియాలోని మొతెరా స్టేడియం బిగ్గెస్ట్‌ క్రికెట్ స్టేడియం కాగా.. మెల్బోర్న్ ​క్రికెట్ గ్రౌండ్ లక్ష పైచిలుకు కెపాసిటీతో తర్వాతి స్థానంలో ఉంది.

Latest Updates