వరల్డ్ కప్ : SRHలో ఆడినోల్లే ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థులు

world-cup-final-srh-players

వరల్డ్ కప్ -2019 క్లైమాక్స్ కి చేరింది. ఆదివారం న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ నువ్వానేను అనే రీతిలో తలపడనున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఈ మ్యాచ్ లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. ఇండియాలో జరిగే  IPL వరల్డ్ వైడ్ గా ఫేమస్ అనేది తెలుసు. అందులో మన SRH టీమ్ లో ఆడిన  ప్లేయర్లు ఇప్పడు ప్రత్యర్థులు కానున్నారు. 2019లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో ఆడిన కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్టిల్, జానీ బెయిర్ స్టో..ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ లో ఆడనున్నారు. విలియమ్సన్, గప్పిల్ న్యూజిలాండ్ కాగా..జానీ బెయిర్ స్టో ఇంగ్లండ్. సో వీరు ఇప్పుడు ప్రత్యర్ధులయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తమ టీమ్ లో అదరగొట్టిన ఈ ముగ్గురికీ శనివారం ట్విట్టర్ ద్వారా ఆల్ ద బెస్ట్ చెప్పింది SRH యాజమాన్యం. ఎలాగో భారత్ ఫైనల్ చేరలేకపోయింది.. ఫైనల్లో ఈ ముగ్గురి సన్‌ రైజర్స్ స్టార్ల ఆటను ఆస్వాదిద్దామంటున్నారు SRH  ఫ్యాన్స్.

Latest Updates