కరోనా గుట్టు విప్పేందుకే..చైనాలో పర్యటించనున్న డబ్ల్యూహెచ్ఓ

కరోనా వైరస్ చైనా వుహాన్ వెట్ మార్కెట్ లో పుట్టిన విషయం తెలిసిందే. అయితే కరోనా వెట్ మార్కెట్ నుంచి వ్యాప్తి చెందలేదని.. ఆధిపత్యం కోసం డ్రాగన్ కంట్రీ బయో వార్ ను వెలుగులోకి తెచ్చిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు నిజమనేలా కొన్ని ఆధారాల్ని చూపిస్తున్నారు. వైరస్ పై రోజు రోజుకు చైనా – అమెరికా దేశాల మధ్య వైరం తారాస్థాయికి చేరడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం అమెరికాకు తలవంచక తప్పలేదు.. వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని డబ్ల్యూహెచ్ ఓ  బృందాన్ని పంపి దర్యాప్తు జరపాలన్న అమెరికా విమర్శల్లో భాగంగా  కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో  కరోనా వైరస్ వ్యాప్తి మూలాన్ని పరిశోధించడానికి డబ్ల్యూహెచ్ ఓ  బృందం చైనాకి వెళ్తుందని ఆసంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధ‌నామ్ గేబ్రేయేస‌స్  ప్రకటించారు. ఈ సందర్భంగా టెడ్రోస్ అధ‌నామ్ గేబ్రేయేస‌స్ మాట్లాడుతూ వైరస్  ఎలా మొదలైందో తెలిస్తేనే దాంతో పోరాడవచ్చని ఆ గుట్టు విప్పేందుకు చైనా వెళుతున్నట్లు ప్రకటించారు.

Latest Updates