కరోనాను మహమ్మారిగా ప్రకటించిన WHO

న్యూఢిల్లీ: రోజూ వేలాది మందికి సోకుతూ వందలాది మందిని చంపుతూ తన పరిధి పెంచుకుంటున్న కొవిడ్ 19, మహమ్మారి (ప్యాండెమిక్ )గా మారిపోయింది. బుధవారం ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్ యూహెచ్ వో) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వైరస్ కట్టడిని చాలా దేశాలు సీరియస్ గా తీసుకోవట్లేదని, సరైన చర్యలు చేపట్టట్లేదని, ఫలితంగా కేసులు ఎక్కువై పోతున్నాయని పేర్కొంది. చైనా కాకుండా మిగతా దేశాల్లో గత రెండు వారాల్లోనే కేసులు 13 రెట్లు పెరిగాయని, అది సోకిన దేశాలు మూడింతలయ్యాయని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోంఘెబ్రియేసస్ అన్నారు. ప్రస్తుతం కొవిడ్ 114 దేశాలకు పాకిందని, ఇప్పటిదాకా లక్షా 18 వేలమందికి సోకిందని చెప్పారు. 4,291 మంది చనిపోయారన్నారు. ఇంకా వేలాది మంది హాస్పిటళ్లలో ప్రాణాల కోసం పోరాడుతున్నారన్నారు. మున్ముందు కేసులు మరింత పెరిగే ప్రమాదముందని, దాంతో పాటే మరణాలు ఎక్కువయ్యే అవకాశముందన్నారు. దాని బారిన పడే దేశాలజాబితా కూడా ఎక్కువయ్యే ముప్పు పొంచి ఉందని చెప్పారు. దీంతో కొవిడ్ ను ప్యాండెమిక్ గా ప్రకటించడం తప్పట్లేదన్నారు.

తేలిగ్గా తీసుకోవద్దు

కరోనా వైరస్ ను తేలిగ్గా తీసుకోవద్దని ఘెబ్రియేసస్ తేల్చి చెప్పా రు. ఇకపై అజాగ్రత్తగా ఉండడానికి లేదన్నారు. ప్యాండెమిక్ అంటే చిన్న విషయం కాదని, చెప్పిన మాటలు వినకపోతే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. అలాగని ప్యాండెమిక్ అనే పదాన్ని దుర్వినియోగం చేసి జనాల్లోలేని పోని భయాలూ సృష్టించొద్దన్నారు. ఏం చేయలేమని చేతులు దులిపేసుకుంటే మరిన్ని కేసులు,మరణాలు పెరిగే ప్రమాదం ఉంటుందన్నారు. కరోనా వైరస్ లాంటి మహమ్మారిని ఇప్పటిదాకా చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాకుండా చర్యలు తీసుకోకుండా ఏ ప్యాండెమిక్ కూడా కంట్రోల్ లోకి వచ్చిన సందర్భాల్లేవన్నారు. ఫస్ట్ కేసు నమోదైనప్పటి నుంచి డబ్ల్యూహెచ్వో అప్రమత్తంగా ఉందని, ప్రతి దేశానికీ ఎప్పటికప్పుడూ సూచనలు చేస్తూనే ఉన్నామని చెప్పారు.

90% కేసులు నాలుగు దేశాల్లోనే

ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో 0 శాతం బాధితులు కేవలం నాలుగు దేశాల్లోనే ఉన్నారని ఘెబ్రియేసస్ చెప్పారు. చైనా, కొరియాలు వైరస్ను బాగా కట్టడి చేశాయన్నారు. ఎపిడెమిక్ నుకంట్రోల్ లోకి తెచ్చాయ న్నారు. 81 దేశాల్లోకొవిడ్ కేసులు లేవని చెప్పారు. 57 దేశాల్లో 10కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. అయితే, ఈ విషయాన్ని అంత గట్టిగా చెప్పలేమని, రాబోయే రోజుల్లో ఆయా దేశాల్లోనూ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. వైరస్ ను కట్టడి చేసేందుకు అందరితో కలిసి పనిచేస్తున్నామన్నారు.

అన్ని వీసాలు రద్దు

కరోనాను డబ్ల్ యూహెచ్వో ప్యాండెమిక్ గా ప్రకటించిన నేపథ్యంలో ఇండియా అన్ని వీసాలను రద్దు చేసింది. డిప్లొమాటిక్ , అఫీషియల్ , యూఎన్ /ఇం-టర్నేషనల్ ఆర్గనైజేషన్స్ , ఎంప్లాయ్ మెంట్ , ప్రాజెక్ట్ వీసాలు తప్ప ఇప్పటికే జారీ చేసిన అన్ని రకాల వీసాలను ఏప్రిల్ 15 దాకా రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిం ది.శుక్రవారం (మార్చి13) నుంచి ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటిదాకా కొవిడ్ ప్రభావిత దేశాలకు మాత్రమే వీసాలు రద్దు చేసిన ప్రభుత్వం , ఇప్పుడు అన్ని దేశాలకూ దానిని పొడిగించింది. కాగా, 12రోజుల పాటు అన్నింటినీ బంద్ పెట్టాలని కువైట్ సర్కార్ ఆదేశాలిచ్చింది. గురువారం నుంచి అమలు చేయాలని చెప్పింది

Latest Updates