వరల్డ్ ఫోటో ఆఫ్ ది ఇయర్

పసిదాని గుండె పరుగెడుతోంది. అతడు అమ్మను ఏం చేస్తాడోనని తల్లడిల్లుతోంది. ఆపుకోలేని బాధ కన్నీళ్లై ధారలు కట్టింది. సాయం కోసం అరవలేని గొంతు పెద్ద పెట్టున రోదిస్తోంది. అతడు అమెరికా బోర్డర్ సెక్యూరిటీ ఆఫీసర్. ఆమె ఆకలితో అలమటిస్తున్న హోండురస్ మహిళ. రెండేళ్ల పసిబిడ్డతో వేల కిలోమీటర్లు ప్రయాణించి అమెరికాను శరణు జొచ్చింది. బోర్డర్ వద్దకు రా గానే ఓ ఆఫీసర్ ఆమెను అడ్డుకున్నాడు. చేతులు వెనక్కు కట్టేసి చెక్ చేశాడు. ఆ తర్వాత ప్రాసెసింగ్ సెంటర్ కు పంపాడు. ఈ ఫొటోను ‘జెట్టి ఇమేజెస్’ ఫొటోగ్రాఫర్ జాన్ మూరీ తీశారు. ఈ ఏడాది ‘వరల్డ్ ప్రెస్ ఫొటో’ ఫొటో ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఈ చిత్రం ఎంపికైంది.

Latest Updates