ఆ డేట్ పైనే విజయ్ దేవరకొండ టార్గెట్!

విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అందుకే అతని సినిమా అప్‌‌డేట్స్‌‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. నెట్‌‌లో వెతుకులాడుతుంటారు. క్రిస్మస్, సంక్రాంతి పండగలకి హీరోలందరి సినిమాలూ వస్తున్నాయి. మరి విజయ్ సినిమా ఎప్పుడొస్తుంది అంటున్నారు అతడి అభిమానులు. మిగిలిన చిత్రాల సంగతి తెలియదు కానీ.. క్రాంతి మాధవ్ డైరెక్షన్‌‌లో తెరకెక్కుతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మాత్రం వేలెంటైన్స్ డేకి రానుందట. విజయ్ చేసేది లవర్‌‌‌‌ బోయ్ క్యారెక్టర్ కావడంతో ఆ రోజునే టార్గెట్ చేశారట. ఈ సినిమాలో ఇక ఒకే ఒక్క షెడ్యూల్ మిగిలుందట. అది కాస్తా పూర్తి చేసి, చకచకా పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి ఎలాగైనా ప్రేమికుల రోజున రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయట. రాశిఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరీన్ త్రెసా, ఇజబెల్లె లీట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ పోషిస్తున్న పాత్రపై చాలా అంచనాలున్నాయి. క్రాంతి మాధవ్ కూడా డిఫరెంట్‌‌గా తీసే దర్శకుడు కావడం వల్ల కూడా ఎక్స్​పెక్టేషన్స్​ బాగా పెరిగాయి. మరి ప్రేమికుల రోజుకు ఈ ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు ఎలా ఎంటర్‌‌‌‌టైన్‌‌ చేస్తాడో చూడాలి.

Latest Updates