ఐఫోన్ తో తీసిన ప్రపంచంలోనే బెస్ట్ ఫొటోలు ఇవే..!

జేమ్స్ బాండ్ సినిమాలో ఎంట్రీ సీన్ లా మంచుకొండల్లో మసక మసకచీకట్లో ఆగి ఉన్న ట్రక్కు.. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో కొండపైన బైబిల్ యాత్రికులు సాగిపోతున్న సీన్.. ఆకాశం పైనుంచి ఏలియన్స్ యూఎఫ్ఓతో వేసిన రెడ్ లైట్ లో ఎర్రగా మెరిసిపోతున్నట్లున్న చెట్టు.. వింటర్ లో మంచుకొండల మధ్య నిద్రలోకి జారుకుంటున్నట్లున్న ఓ విలేజ్.. బీజింగ్ లోని ఓ వీధిలో నైట్ లైఫ్.. మాస్కోలోని ఓ బస్తీవాసుల లైఫ్ ను చాటే సీన్.. ఐఫోన్ తో తీసిన ప్రపంచంలోనే బెస్ట్ 6 ఫొటోలివి! ‘యాపిల్ ఫస్ట్ ఐఫోన్ నైట్ మోడ్ ఫొటోగ్రఫీ కాంపిటీషన్’లో ‘బెస్ట్ 6’గా నిలిచిన ఫొటోలు ఇవేనని ఆ కంపెనీ వెల్లడించింది.

లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ కెమెరాలో నైట్ మోడ్ ఫీచర్ పనితీరు సత్తాను చాటేందుకని.. యాపిల్ కంపెనీ జనవరిలో ఈ కాంపిటీషన్ ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఎంట్రీల నుంచి 6 బెస్ట్ ఫొటోలను జడ్జీల ప్యానెల్ ఎంపిక చేసింది. విజేతల పేర్లు, వాళ్లు తీసిన ఫొటోలను ఈ నెల 3న విడుదల చేసింది. ఈ ఫొటోలన్నీ ఐఫోన్ 11, ఐఫోన్ 11ప్రో, ఐఫోన్ 11 మ్యాక్స్ ద్వారా నైట్ మోడ్ ఫీచర్ తో తీసినవే. వీటిలో ఎర్రటి లైట్ లో మెరిసిపోతున్న చెట్టు ఫొటోను తీసింది ముంబైకి చెందిన ఫొటోగ్రాఫర్ మిత్సున్ సోని కావడం విశేషం. అతడు ఈ ఫొటోను ఐఫోన్11 ప్రోతో తీసి పోటీలో విజేతగా నిలిచాడు.

Latest Updates