ప్రపంచంలోనే తొలి లాంగ్వేజ్ మ్యూజియం

వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు

మే 31న ప్రారంభం

వరల్డ్ వైడ్‌గా కల్చర్, ఆర్ట్‌‌‌‌, హిస్టరీకి సంబంధించి ఎన్నో మ్యూజియాలు ఉన్నాయి. కానీ లాంగ్వేజ్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడా మ్యూజియం లేదు. ఇదిగో ఇట్లాంటి మ్యూజియం ఒకటి ఇప్పుడు అమెరికాలో అందుబాటులోకి రానుంది. అదేంటి భాషకు సంబంధించిన మ్యూజియం ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమనే డౌటు వస్తుంది కదా! కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది అమెరికాలోని ఓ స్కూల్. పూర్తిగా వర్డ్స్, లాంగ్వేజ్ కు సంబంధించిన ఈ మ్యూజియంను వాషింగ్టన్ డీసీలోని హిస్టారికల్ ఫ్రాంక్లిన్ స్కూల్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ‘‘ప్లానెట్ వర్డ్’’ పేరుతో రూపొందిస్తున్న ఈ మ్యూజియంను మే 31న ఓపెన్ చేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ లాంగ్వేజ్ ల చరిత్రను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇంటరాక్టివ్ మెథడ్స్ ద్వారా లాంగ్వేజ్ ల గురించి విజిటర్స్ కు వివరించనున్నారు. 51 వేల చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఈ మ్యూజియంలో 10 గ్యాలరీలు ఉంటాయి. మ్యూజియం చూడడానికి ప్రవేశం ఉచితం కూడా. మరోవైపు మ్యూజియం ఏర్పాటు చేస్తున్న ఫ్రాంక్లిన్ స్కూల్ కు కూడా ఘనమైన చరిత్ర ఉంది. ఈ స్కూల్ లోనే అలెగ్జాండర్ గ్రహంబెల్ 1880లో వరల్డ్ ఫస్ట్ వైర్ లెస్ వాయిస్ ట్రాన్స్ మిషన్​ ‘‘ఫొటోఫోన్ ట్రాన్స్ మిషన్”ను తయారు చేశాడు. 1869లో నిర్మించిన ఈ స్కూల్ బిల్డింగ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్​ హిస్టారికల్ ప్లేసేస్ లో చోటు సంపాదించుకుంది.

ఏమిటీ మ్యూజియం స్పెషాలిటీ?

విజిటర్స్ ఇక్కడ ఫేమస్ పోయమ్స్, స్పీచ్ లను బ్రీఫ్ గా వినొచ్చు. అదే విధంగా మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవచ్చు.

మనకు నచ్చిన లాంగ్వేజ్ ను సెలెక్ట్ చేసుకొని, ఆ భాషలోని కొన్ని కల్చరల్ వర్డ్స్ ను నేర్చుకోవచ్చు.

ఇక్కడ క్లాసెస్ కూడా నిర్వహించనున్నారు. సైన్ లాంగ్వేజ్, సాంగ్ రైటింగ్ తదితర అంశాలపై తరగతులు ఉంటాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ నూ విజిటర్స్ కు నేర్పించనున్నారు. ఇందుకోసం 31 మంది లాంగ్వేజ్ అంబాసిడర్లను నియమిస్తున్నారు.

ఇక్కడి లాంగ్వేజ్ ల్యాబ్ రీసెర్చర్లకు కూడా ఉపయోగపడనుంది. లింగ్విస్టిక్స్ పై జరిగే రీసెర్చ్, లాంగ్వేజ్ స్టడీస్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంది.

మ్యూజియంలో  22 అడుగుల ఎత్తుండే ‘‘వర్డ్ వాల్”ఉంటుంది. దానిపై వెయ్యి ఇంగ్లిష్​ వాయిస్ యాక్టివేటెడ్ వర్డ్స్ ఉంటాయి. మనం ఏ వర్డ్ పై క్లిక్ చేస్తే… అది ఎలా పుట్టిందో తెలుస్తుంది.

మ్యూజియంలో ‘‘స్పీకింగ్ విల్లోవ్”కూడా ఉంటుంది. చెట్టు రూపంలో ఉండే దీని దగ్గరికి వెళ్లినప్పుడు మనకు పోయమ్స్, స్పీచెస్ వివిధ లాంగ్వేజెస్ లో వినిపిస్తుంటాయి. ఇందుకు 500 స్పీకర్లను ఏర్పాటు చేశారు.

Latest Updates