చైనాకు కరోనా సెగ : భారత్ కు 200 అమెరికా కంపెనీలు

చైనాకు కరోనా వైరస్ సెగ గట్టిగా తగులుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ , మెడిసిన్ తో పాటు అన్నీ రకాల వస్తువులు చైనాలోనే తయారవుతాయి. దీంతో ఆ దేశానికి ఇతర దేశాల కంపెనీలు క్యూకట్టాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

కరోనా వైరస్ చైనా వుహాన్ లోని వైరాలజీ ల్యాబ్ నుంచి వచ్చిందా లేదంటే గబ్బిలాల నుంచి వచ్చిందా అనే విషయం పక్కన పెడితే..కరోనా ఎఫెక్ట్ తో చైనాలో ఉన్న అమెరికాకు చెందిన 200 కంపెనీలతో పాటు ఇతర దేశాలకు చెందిన సంస్థలు భారత్ లో స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 30శాతం ఎలక్ట్రానిక్ వస్తువులు చైనా నుంచే ఉత్పత్తి అవుతాయి. తక్కువ ప్రైస్ తో పాటు అందరికి అందుబాటులో ఉండేలా వస్తువుల్ని డిజైన్ చేయడంతో చైనా పేరు గడించింది. కానీ ఇప్పుడు కరోనాతో ఆ దేశ పారిశ్రామిక రంగం భారీ సవాళ్లను ఎదుర్కుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా గతేడాది ఏప్రిల్ నెలలో చైనాతో తెగతెంపులు చేసేందుకు ప్రయత్నించింది. దీనికి తోడు నవంబర్ నుంచి కరోనా వెలుగులోకి రావడంతో అమెరికా కు చెందిన 200కంపెనీలో భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయని తెలుస్తోంది.

జపాన్ సైతం చైనాలో ఉన్న కంపెనీలు తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చేలా 2.2 బిలియన్ డాలర్లను కేటాయించింది.  ఇక అమెరికా సైతం చైనా కాకుండా భారత్ లో తమ కంపెనీలను స్థాపించనున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

 

Latest Updates