ఆ ఒక్క బూత్ లో143 శాతం పోలింగ్

అక్కడున్నది 49 మంది ఓటర్లే. కానీ, 70 మంది ఓటేశారు. పోలింగ్​ 143 శాతం నమోదైంది. చదవడానికి విచిత్రంగా అనిపించినా అదే నిజం. ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్​ స్టేషన్​ తషిగాంగ్​ గ్రామంలో జరిగిందీ వింత ఓటింగ్​. హిమాచల్​ ప్రదేశ్​లో ఉన్న ఆ గ్రామం సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. పడిన ఓట్లన్నీ ‘కరెక్ట్​’ అని రిటర్నింగ్​

అధికారులూ ప్రకటించడం మరింత విడ్డూరం. మరి, మిగతా ఓటర్లెలా వచ్చారు? అంటే తషిగాంగ్​, ఆ పక్కనున్న ఊళ్లలో పోలింగ్​ డ్యూటీ పడిన పోలింగ్ అధికారులు తషిగాంగ్​లోనే ఓటేశారు. ఎలక్షన్​ డ్యూటీ సర్టిఫికెట్​ (ఈడీసీ)ని చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్​ 142.85 శాతానికి చేరిందన్నమాట. నిజానికి ఆ ఊళ్లోని 49 మంది ఓటర్లలో ఓటేసింది 36 మందే. అందులో 21 మంది మగవాళ్లు, 15 మంది మహిళలున్నారు. అంటే నిజానికి అక్కడైన పోలింగ్​ 74 శాతం మాత్రమే. మిగతా అన్ని ఓట్లూ పోలింగ్​ అధికారులవే. వాళ్లు అక్కడే ఎందుకు ఓటేశారంటే.. ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్​ కేంద్రం కదా. అందుకే అక్కడే ఓటేస్తే కొంచెం గుర్తింపైనా దక్కుతుందని ఆశ పడ్డారు. అందరూ అక్కడే ఓటేశారు. అదన్నమాట సంగతి

.

Latest Updates