ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ వరల్డ్ లోనే అతిపెద్ద స్టేడియం. అక్కడ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆటగాళ్ళు బాల్ ను బౌండరీ దాటించడం అంటే ఎంతో గ్రేట్. అంతటి గుర్తింపు ఉన్న ఆ గ్రౌండ్ ఇప్పుడు రెండో స్థానంలోకి చేరనుంది.

భారత్‌లోని అహ్మదాబాద్‌ లో నిర్మించిన కొత్త క్రికెట్‌ స్టేడియం ఇక నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం కానుంది. రూ.700 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ స్టేడియం కెపాసిటీ ఒక లక్షా 10 వేలు. ఈ స్టేడియంలో 70 కార్పోరేట్‌ బాక్స్‌లను, నాలుగు డ్రెస్సింగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఒలంపిక్స్‌ సైజ్‌ స్విమ్మింగ్‌ పూల్‌ కూడా ఈ స్టేడియంలో ఉంది. 2017 జనవరిలో ఈ స్టేడియం నిర్మాణ పనులను ప్రారంభం కాగా… పూర్తి కావడానికి సుమారు మూడేళ్లు పట్టింది. వచ్చే ఏడాది మార్చిలో ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌ జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు.

Latest Updates