కోతులను తినే గద్ద.. ఒరిస్సాలో వాలింది!

ప్రపంచలంలోనే అతిపెద్దగా ఉండే ఫిలిప్పీన్స్‌‌ ఈగల్‌‌ జాతి గద్దలు. చిన్నాచితకా పాములను తినడమే కాదు. ఏకంగా కోతులనే ఎత్తుకుపోయి తినేస్తుంటాయి. ఎక్కువగా ఫిలిప్పీన్స్‌‌లోనే కనిపిస్తుంటాయి. అట్లాంటి అరుదైన గద్ద ఒకటి ఇండియాకు వచ్చింది. ఒరిస్సాలోని బారిపడా ఫారెస్ట్‌‌ డివిజన్‌‌లో కనబడింది. చాలా కష్టపడి ఫారెస్టు అధికారులు దాన్ని కాపాడారు. మెడికల్ చెకప్స్ చేసి సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ లో వదిలేశారు. గద్దను వీడియో తీసి విడుదల చేశారు. వీడియోలో గద్దను పరిశీలించిన ఎక్స్‌‌పర్ట్స్.. అది ఫిలిప్పీన్స్ గద్దలా కనిపిస్తలేదంటున్నారు. మనదేశంతో పాటు ఆసియాలోని వేడి ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే క్రెస్టెడ్ సర్పెంట్ ఈగల్ జాతికి చెందినదానిలా ఉందని చెబుతున్నారు. భయం లేదా కోపం వల్ల ఈ పిల్ల క్రెస్టెడ్‌‌ గద్ద ఈకలు డిఫరెంట్‌‌గా పైకి లేచాయని, అందుకే ఇది ఫిలిప్పీన్స్ ఈగల్ మాదిరిగా కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఇది ఇండియన్ ఈగలేనా? లేక నిజంగా ఫిలిప్పీన్స్ ఈగలా? ఇంకా నిర్ధారణ కాలేదు!

Latest Updates