ప్రపంచంలోనే ఖరీదైన బిర్యానీ.. ప్లేట్ రూ.20 వేలు

మామూలుగా  ప్లేట్ బిర్యానీ ఎక్కడైనా  రూ.100 నుంచి రూ.1000 వరకు  ఉంటుంది కానీ. దుబాయ్ లో ప్లేట్ బిర్యానీ రూ. 19,700 అంట. దీనిని గోల్డెన్ బిర్యానీ అంటారంట..దుబాయ్ లో  బాంబే బరోఅనే ఇండియన్ రెస్టారెంట్.. రాయలో గోల్డ్ బిర్యానీ పేరుతో బిర్యానీని అమ్ముతుంది. ఇందులో ప్లేట్ బిర్యానీ విలువ 1000 దిర్హామ్ లు  అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.19,700. 23 కారెట్ల తినే బంగారంతో గార్నిష్ చేసి దీన్ని వడ్డిస్తారంట. అందుకే దీనిని గోల్డ్ బిర్యానీ అంటారు. ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన బిర్యాని అని చెబుతున్నారు నిర్వాహకులు. ఆర్డరిస్తే 45 నిముషాల్లో రెడీ చేస్తారంట. ఈ బిర్యానీ కోసం అక్కడ ఎగబడి తింటున్నారని చెబుతున్నారు.

అంతేగాకుండా మామూలు బిర్యానీలో ఒక అన్నం మాత్రమే ఉంటుంది కానీ ఇందులో చాలా ప్రత్యేకతలు  ఉన్నాయి. బిర్యానీ రైస్, కీమా రైస్, మరియు వైట్, కుంకుమ బియ్యం ఉంటాయి. దీని బరువు దాదాపు  3 కిలోలు ఉంటుంది. రైస్ పై బేబీ బంగాళాదుంపలు, ఉడికించిన గుడ్లు, కాల్చిన జీడిపప్పు, దానిమ్మ, వేయించిన ఉల్లిపాయలు, పుదీనాతో అందంగా తీర్చిదిద్దుతారు. అన్నంపై బంగారు రేకులతో చుట్టిన  కాశ్మీరీ లాంబ్ సీఖ్ కేబాబ్స్, రాజ్‌పుత్ చికెన్ కేబాబ్స్, మొఘలాయ్ కోఫ్తా, మలై చికెన్ రోస్ట్, ఓల్డ్ ఢిల్లీ లాంబ్ చాప్స్ వంటి కాల్చిన మాంసం పెడతారు. బిర్యానీతో పాటు నిహారీ సలాన్, జోధ్‌పురి సలాన్, బాదామి సాస్, బాదం , దానిమ్మ రైతా, పలు రకాల సాస్‌లు, కూరలు రైటాస్ కూడా వడ్డిస్తారు.

Latest Updates