ప్రపంచంలోనే అత్యంత విలువైన రేస్.. రూ.143 కోట్ల ప్రైజ్ మనీ

ఎల్లుండి సౌదీ అరేబియాలో నిర్వహణ
పోటీలో14 మంది రైడర్స్
విజేతకు రూ.71.73 కోట్ల ప్రైజ్ మనీ

ప్రపంచంలోనే అత్యంత విలువైన గుర్రపు పందాన్ని సౌదీ అరేబియా నిర్వహించనుంది. ఏకంగా రూ.143.31 కోట్ల ప్రైజ్ మనీతో ఇది వరల్డ్ రిచెస్ట్ హార్స్ రేస్‌గా నిలవనుంది. సౌదీ కప్ పేరుతో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌లో మెయిన్ రేస్ ఫిబ్రవరి 29న కింగ్ అబ్దులాజీజ్ రేస్ ట్రాక్‌లో నిర్వహించనున్నారు. 14 మంది రైడర్లు 1,800 మీటర్ల మట్టి ట్రాక్‌పై పోటీ పడనున్నారు. ఇందులో విజేతకు రూ.71.73 కోట్లు, సెకండ్ ప్లేస్‌లో నిలిచిన వారికి రూ.25.10 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తారు. 10వ స్థానంలో నిలిచిన వారికి కూడా ఎంతో కొంత ప్రైజ్ మనీ దక్కనుంది. ఈ పోటీలో భాగంగా మరో 7 రేస్‌లను కూడా నిర్వహించనున్నారు. ఈ రేస్‌ల విలువ రూ.65.91 కోట్లు. ఇటీవల స్పోర్స్ట్ ఈవెంట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సౌదీ అరేబియా ఈ పోటీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. గత కొన్నేళ్లుగా స్పోర్స్ట్ ఈవెంట్లలో అధికంగా పెట్టుబడులు పెడుతున్న ఈ దేశం.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందాలని చూస్తోంది. ఆ దేశ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు, దేశంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఇలాంటి ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. అందుకు తగ్గట్లే సౌదీ కప్‌కు ఏర్పాట్లు చేస్తోందీ దేశం. ఈ పోటీని చూసేందుకు దాదాపు10 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తోంది.

పోటీలో ఫిమేల్ జాకీలు..
2018లో వరల్డ్ రిచెస్ట్ హార్స్ రేస్‌గా పెగాసస్ వరల్డ్ కప్ నిలిచింది. ఈ కప్‌ను 2018లో 114.64 కోట్లతో నిర్వహించగా, 2019కి వచ్చే సరికి దీని విలువ రూ.64.48 కోట్లకు పడిపోయింది. ఇక ప్రతిఏటా నిర్వహించే దుబాయ్ వరల్డ్ కప్ అంతకుముందు వరకు వరల్డ్ రిచెస్ట్ హార్స్ రేస్. 2019లో దీని ప్రైజ్ మనీ రూ. 85.95 కోట్లు. ఇక సౌదీ అరేబియా కప్‌లో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన జాకీలు పాల్గొననున్నారు. ఇటాలియన్ లెజెండ్ ఫ్రాంకీ డెట్టోరీ, బ్రిటన్‌కు చెందిన ర్యాన్ మూర్ పోటీలో ఉన్నారు. ఇంటర్నేషనల్ ఫిమేల్ జాకీ నికోలా క్యూరీ సైతం ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. సౌదీ అరేబియా కాంపిటేటివ్ రేస్‌లో పాల్గొన్న తొలి మహిళా జాకీగా ఈమె రికార్డు సృష్టించనున్నారు. శుక్రవారం జరగనున్న ఫోర్ రేస్ పాయింట్స్ బేస్డ్ చాలెంజ్‌లో ఫ్రాంకీ డెట్టోరీ నేతృత్వంలోని ఏడుగురు మేల్ రైడర్స్ బృందంతో నికోలా నేతృత్వంలోని ఏడుగురు ఫిమేల్ రైడర్స్ బృందం పోటీ పడనుంది. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌లోనే మేల్, ఫిమేల్ రైడర్స్ మధ్య పోటీ ఉంటుందని, అలాంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.

For More News..

ఒకటి కాదు.. రెండు కాదు.. ఆ ఊళ్లో 400 జతల కవలలు

వాషింగ్టన్‌లో ల్యాండవ్వగానే భారత టూర్‌పై ట్రంప్ ట్వీట్

ఇంటర్​ మెమోలో కీలక మార్పులు

Latest Updates