అమ్మవారి ప్రసాదం లో పురుగులు

worms-in-basra-saraswathi-temple-prasadam

బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో అధికారులు నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అమ్మవారి  ప్రసాదంలో పురుగులు రావడం కలకలం రేపింది. భక్తులు ఆలయంలో విక్రయించిన లడ్డూ ప్రసాదాన్ని తింటున్న సమయంలో  లడ్డు లోంచి పురుగు రావడంతో అవాక్కయ్యారు. ఎంతో ప్రాముఖ్యతతో అమ్మవారి ప్రసాదాన్ని తీసుకుంటే ఇలా పురుగులు రావడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. గతంలో కూడా అమ్మవారి ప్రసాదాల లో పురుగులు, చెత్త కనిపించిందని, అయినప్పటికీ ఇదే ఘటన మరలా పునరావృతమైనందుకు భక్తులు, గ్రామస్తులు మండిపడుతున్నారు

Latest Updates