ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలవడమే టార్గెట్: స్మిత్

ఇండియాలో టెస్ట్‌‌ క్రికెట్‌ ఆడటం కత్తి మీద సామే అయినా.. ఇక్కడ ఈ ఫార్మాట్‌లో సిరీస్‌‌ గెలవడం తన కెరీర్‌‌లో మేజర్‌‌ గోల్‌‌ అని స్పష్టం చేశాడు. ‘ఇండియాలో టెస్ట్ సిరీస్ ‌ గెల వడాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతా. ఓ ఆసీస్‌‌ క్రికెటర్‌‌గా యాషెస్‌‌ గురించి మాట్లాడటం పెద్ద విషయం. తర్వాత వరల్డ్ ‌కప్‌ గురించి. కానీ నా దృష్టిలో ఇప్పుడు ఇండియా వరల్డ్‌‌ నంబర్‌ ‌వన్‌ టీమ్‌. అలాగే ఇండియాలో టెస్ట్‌‌ క్రికెట్‌ ఆడటం చాలా కష్టంతో కూడుకున్నది. అందుకే ఇక్కడ సిరీస్‌‌ గెలిస్తేవచ్చే మజా డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు ఈ గోల్‌‌ తప్ప మరే టార్గెట్స్‌‌ లేవు. ఎక్కువ గోల్స్ ‌పెట్టుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు’ అని స్మిత్‌ స్పష్టం చేశాడు. టీమిండియా లెఫ్ట్ ఆర్మ్‌‌ స్పిన్నర్‌‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమని స్మిత్‌ చెప్పాడు. గుడ్‌ లెంగ్త్‌ ‌తో పాటు బంతిని ఒకవైపు నుంచి స్పిన్‌తో పాటు స్కిడ్‌ చేస్తాడని కితాబిచ్చాడు.

Latest Updates