ఒంటి చేయితో మట్టి కరిపించాడు

Wrestler Ganesh won his match with a single hand

ఎక్కడ కుస్తీ పోటీలు ఉంటే అక్కడికి వాలిపోతుంటాడు ఆ యువకుడు. తన వెయిట్‌(బరువు)కేటగిరిలో ఇప్పటి వరకు ఓటమన్నదే తెలియదు. ఒక చేయి లేకున్నా ప్రత్యర్థుల్ని తనకే ప్రత్యేకమైన పట్లతో మట్టి కరిపించి విజయాలు సొంతం చేసుకుంటుండడం స్ఫూర్తిదాయకం. మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలుకా కర్కెల్లి  గ్రామానికి చెందిన గణేశ్‌(25) ఐదేళ్ల క్రితం రైలు ప్రమాదంలో కుడిచేయిని కోల్పోయాడు. అయినా అధైర్యపడకుండా తనకు ఇష్టమైన కుస్తీ ప్రాక్టీస్‌ కొనసాగించారు. మంచి మల్లయోధుడిలా మారాడు. సోమవారం భైంసా మండలం కామోల్ లో జరిగిన కుస్తీ పోటీల్లో ఇతన ప్రతిభకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు.

-భైంసా, వెలుగు

Latest Updates