పీజీ ఎగ్జామ్స్ కు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

చదువుకోవాలనే పట్టుదల, తపన ఉండాలి కానీ చదువుకు వయసు,హోదాతో సంబంధం లేదు. కొందరికి పీజీ చేయాలని, మరి కొందరికి డాక్టర్ కావాలని, కలెక్టర్ కావాలని ఇలా ఎన్నో కోరికలుంటాయి. కొందరికి ఆర్థిక సమస్యలు, ఇతర కారణాల వల్ల చదువును మధ్యలోనే ఆపేస్తారు. ఇవన్నీ నెరవేరాలంటే వయసు, హోదాను పట్టించుకోకుండా పట్టుదలతో చదువుకుంటే  తప్పకుండా సాధించవచ్చు.

ఓ వైపు ఎమ్మెల్యే అయినా తన చదువును కొనసాగిస్తున్నారు ఓ ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరనుకుంటున్నారా?  ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ . పీజీ చేయాలనే తన  కోరికను ఇప్పుడు నెరవేర్చుకుంటున్నారు. ఓ వైపు  ఎమ్మెల్యేగా బిజీగా ఉన్నా తన చదువును కొనసాగిస్తున్నారు. డిస్టెన్స్ లో ఎంఏ చదువుతున్న రాములు నాయక్  ఇవాళ(బుధవారం) పీజీ ఎగ్జామ్స్ కు అటెండ్ అయ్యారు. ఖమ్మంలోని SR and BGNR govt degree college లో  ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాశారు. స్టూడెంట్స్ తో కలిసి ఆయన ఎగ్జామ్ రాశారు.

Latest Updates