వివో నుంచి ఎక్స్‌‌50, ఎక్స్‌‌ 50 ప్రో

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో ఇండియన్‌‌ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్‌లోకి ఎంటర్‌‌‌‌ అవుతోంది. వివో ఎక్స్50, ఎక్స్50 ప్రో తో వీటిని తీసుకురానుంది. ఈ ఫోన్లను గ్రేటర్ నోయిడా ఫెసిలిటీలో తయారు చేశామని కంపెనీ తెలిపింది. ప్రొఫెషనల్ గ్రేడ్ కెమెరా టెక్నాలజీతో ఇవి రూపొందాయని, తమ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌లో ప్రీమియం డివైజ్‌ల కోసం కస్టమర్లు చూస్తున్నారని పేర్కొంది. తమ ప్రొడక్ట్స్‌ పోర్టుఫోలియోను విస్తరించేందుకు ఇదే కరెక్ట్ టైమ్ అని వివో ఇండియా బ్రాండ్ స్ట్రా టజీ డైరెక్టర్ నిపున్ మార్యా చెప్పారు. ఇండియాలో రిటైల్ నెట్‌వర్క్‌‌ను విస్తరించేందుకు ‘స్మార్ట్ రిటైల్’ మోడల్‌‌ను ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఎంచుకుంది.

 

Latest Updates