‘ఎక్స్‌‌కాన్‌’ను హైదరాబాద్‌లో నిర్వహించండి: కేటీఆర్

సర్కారు ఆతిథ్యం ఇస్తుంది  సీఐఏ వెబినార్‌లో మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కన్‌‌స్ట్ర క్షన్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ (సీఐఏ)కు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కన్‌‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ తయారీకి రాష్ట్రంలో ఇప్పటికే ప్రత్యేక పార్కు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర సర్కారు చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, మైనింగ్ అవకాశాలు, హైదరాబాద్‌లో రోడ్లు, బిల్డింగుల నిర్మాణాలు, పారిశ్రామిక పార్కుల వల్ల కన్‌‌స్ట్ర క్షన్ ఎక్విప్‌మెంట్ పరిశ్రమకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. సీఐఏ నిర్వహించే ఎక్స్‌‌కాన్ వంటి కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని, ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తుందని చెప్పారు. ఇండియా కన్‌‌స్ట్ర క్షన్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన వెబినార్‌లో మంత్రి పాల్గొన్నారు. కన్‌‌స్ట్ర క్షన్ ఎక్విప్‌మెంట్ పరిశ్రమకు సవాళ్లు, అవకాశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు.

Latest Updates