మన పిల్లలకు చైనా కంపెనీ చేయూత..

రూ.2కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లు డొనేట్ చేస్తున్న చైనా కంపెనీ షియోమి

న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్‌‌ఫోన్ కంపెనీ షియోమి ఇండియా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ టెక్ ఫర్ ఇండియాతో జతకట్టింది. ఈ భాగస్వామ్యంతో రూ.2 కోట్ల విలువైన 2,500 స్మార్ట్‌‌ఫోన్లను కంపెనీ పిల్లలకు డొనేట్ చేస్తోంది. కరోనా వైరస్‌ మహమ్మారితో బాగా ప్రభావితమైన పిల్లలకు ఈ ఫోన్లను అందించనున్నామని షియోమి ఎండీ మను జైన్ తెలిపారు. తమ ఎక్స్‌ క్లూ జివ్ రిటైల్ నెట్‌‌వర్క్ ఫోన్లను డొనేట్ చేస్తుందని చెప్పారు. పిల్లలకు ఇప్పుడు ఆన్‌‌లైన్ ఎడ్యుకేషన్ తప్పనిసరైంది. టెక్ ఫర్ ఇండియా పార్టనర్‌‌‌‌షిప్‌ తో పిల్లలకు ఆన్‌‌లైన్ లెర్నింగ్‌ లో సాయపడనున్నామని తెలిపారు.

Latest Updates