ఇండియాలో వెయ్యి స్టోర్లు పూర్తి చేసుకున్న షియోమీ

సరికొత్త మోడల్స్ తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న షియోమీ మరో స్టోర్ ను ప్రారంభించింది. భార‌త్‌ లో త‌న 1000వ స్టోర్‌ ను శనివారం ఓపెన్ చేసింది. హ‌ర్యానాలోని రెవారిలో షియోమీ త‌న కొత్త MI స్టోర్‌ ను ప్రారంభించింది. ఇది షియోమీకి 1000వ స్టోర్ కావ‌డం విశేషం. త్వ‌ర‌లో ఎంఐ స్టూడియో పేరుతో కొత్త స్టోర్స్‌ను ఇతర ప్రాంతాల్లో లాంచ్ చేస్తామ‌ని తెలిపింది షియోమీ. ప్ర‌స్తుతం బెంగ‌ళూరు, ముంబై న‌గ‌రాల్లో మాత్ర‌మే MI స్టూడియోలు ఉన్నాయి. MI హోం స్టోర్స్ ను మించి వినియోగ‌దారుల‌కు సేవ‌ల‌ను అందించేందుకు MI స్టూడియోల‌ను దేశంలోని 50 న‌గ‌రాల్లో త్వ‌ర‌లో ప్రారంభిస్తామ‌ని షియోమీ ప్ర‌తినిధులు తెలిపారు.

Latest Updates