షావోమీ రికార్డు సేల్స్

  • 53 లక్షలకు పైగా డివైజ్‌‌ల అమ్మకం

బెంగళూరు: చైనా హ్యాండ్‌‌సెట్ మేకర్‌‌‌‌ షావోమీ ఈ ఫెస్టివ్ సీజన్ సేల్‌‌లో రికార్డు సృష్టించింది. 53 లక్షలకు పైగా డివైజ్‌‌లను విక్రయించింది. ‘ఈ ఫెస్టివ్ సీజన్‌‌ షావోమీకి అద్భుతమైనది. 53 లక్షల మంది కస్టమర్లతోపాటు మేము ఈ ఫెస్టివల్ సీజన్‌‌ను సెలబ్రేట్ చేసుకున్నాం. కొత్త ప్రొడక్ట్‌‌లు, ఆకర్షణీయమైన ఆఫర్లతో మా కన్జూమర్లకు మరింత సంతోషం కలిగించాం’ అని షావోమీ ఇండియా కేటగిరీస్ అండ్ ఆన్‌‌లైన్ సేల్స్ హెడ్‌‌ రఘు రెడ్డి తెలిపారు. ఈ పండుగ కాలంలో ఇండియాలో 38 లక్షలకు పైగా స్మార్ట్‌‌ఫోన్లను అమ్మినట్టు పేర్కొన్నారు. అమెజాన్‌‌లో కూడా బెస్ట్‌‌ సెల్లింగ్‌‌ స్మార్ట్‌‌ఫోన్ బ్రాండ్‌‌గా షావోమీ నిలిచినట్టు చెప్పారు. ఈ ఫెస్టివల్ కాలంలో సెకనుకు 535 డివైజ్‌‌లను విక్రయించినట్టయింది. షావోమీ స్మార్ట్‌‌ఫోన్లను, ఎంఐ టీవీలను, ఎంఐ బ్యాండ్స్‌‌ను, ఎంఐ పవర్ బ్యాంక్‌‌లను, ఎంఐ ఇయర్ ఫోన్లను, ఇతర ఎంఐ ఎకోసిస్టమ్ డివైజ్‌‌లను, ఇతర యాక్ససరీస్ ప్రొడక్ట్‌‌లను ఎంఐ.కామ్, ఇతర పార్టనర్ ప్లాట్‌‌ఫామ్స్‌‌పై విక్రయిస్తోంది. గతేడాది పండుగ సీజన్‌‌లో 25 లక్షలకు పైగా స్మార్ట్‌‌ఫోన్లను అమ్మింది.

Latest Updates