మద్యం మత్తులో కలెక్టర్ కారును ఢీకొట్టాడు

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మండలం , అనాజిపురం గ్రామం దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న ఇండికా కారును ఢీకొట్టిన లారీ.. అదే దారిలో వెళ్తున్న యాదాద్రి భువనగిరి కలెక్టర్ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ క్షేమంగా బయటపడినట్లు తెలిపారు.

అకాల వర్షం వల్ల నష్టపోయిన పంట పొలాలను వలిగొండ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ గారు తిరిగి కలెక్టర్ కార్యాలయంకు బయలుదేరుతున్న ఈ క్రమంలో భువనగిరి మండలం అనాజిపురం గ్రామ శివారులోఈ ప్రమాదం జరిగింది.  లారీ డ్రైవర్ మద్యం మత్తులో లారీ నడిపినట్లు తెలిపిన పోలీసులు.. కేసు నమోదు చేశామన్నారు.

Latest Updates