యాదాద్రి.. సీఎం కేసీఆర్‌ కలల ప్రాజెక్టు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్ర‌పంచ స్థాయిలో పున‌రద్ధ‌రించార‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. యాదాద్రి ఆల‌య పునరుద్ధరణ సీఎం కేసీఆర్‌ కలల ప్రాజెక్ట్ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఓవైపు ప్రతిష్టాత్మక కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టు వంటి ఆధునిక దేవాలయాలను నిర్మిస్తున్న కేసీఆర్‌.. అదే సమయంలో ప్రపంచస్థాయి అధ్యాత్మిక విశ్వనగరిగా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా యాదాద్రికి ఆలయానికి సంబంధించిన వీడియోను కేటీఆర్‌ పంచుకున్నారు.

Latest Updates