యాదాద్రి ఓపెనింగ్ వాయిదా

యాదాద్రి ప్రారంభానికి కరోనా బ్రేక్

వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసిన సర్కార్​!

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవాన్ని సర్కారు వాయిదా వేసినట్టు తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్టు సమాచారం. త్వరలోనే చినజీయర్ స్వామిని సీఎం కేసీఆర్ కలిసి ముహూర్తం ఖరారు చేస్తారని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇటీవల యాదాద్రి పనులను పరిశీలించిన సీఎం ఆఫీసర్లతో సమీక్ష చేశారు.  ప్రస్తుత పరిస్థితుల్లో ప్రారంభోత్సవం సరికాదని, ఫిబ్రవరికి వాయిదా వేయడం మంచిదని సీఎం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ ఏడాది నవంబర్‌‌లోనే ఆలయాన్ని ప్రారంభించాలని కేసీఆర్ భావించారు. 1,048 యజ్ఞ కుండాలతో మహా సుదర్శన యాగం కూడా చేయనున్నట్టు సీఎం ప్రకటించారు.

త్వరలో పాలక మండలి ఏర్పాటు 

యాదాద్రి ప్రారంభోత్సవం కంటే ముందుగానే ఆలయ పాలక మండలిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడాదిన్నర క్రితం యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఇంతవరకు చైర్మన్, మెంబర్లను నియమించలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను చైర్మన్ గా నియమించే చాన్స్ ఉన్నట్టు తెలిసింది.

Latest Updates