యాదాద్రి టెర్మినల్‌ కు ఓకే

రూ. 570 కోట్ల పెట్టుబడి

సుమారు 500 మందికి ఉపాథి

యాదాద్రి సమీపంలో IOC పెట్రోలియమ్‌‌‌‌ స్టోరేజ్‌, డిస్ట్రిబ్యూషన్‌ టెర్మినల్‌ ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ శాఖలోని నిపుణుల కమిటీ (EAC) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 165 మిలియన్‌ లీటర్ల సామర్థ్యం ఉండే 28 ట్యాంకులతో ఈ టెర్మినల్‌ నెలకొల్పనున్నారు. యాదాద్రి జిల్లా మల్కాపూర్‌‌‌‌ వద్ద రూ. 570 కోట్ల వ్యయంతో IOC నెలకొల్పనుంది. అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత ఈ ప్రాజెక్టును ఎన్విరాన్‌ మెంటల్‌ క్లియరెన్ స్‌ కు సిఫారసు చేస్తున్నట్లు EAC తెలిపింది. ఐతే, ప్రాజెక్టు అమలుకు కొన్ని నిబంధనలు విధించింది. ప్రాజెక్టు వ్యయంలో కనీసం 2 శాతం కార్పొరేట్‌ ఎన్విరాన్‌ మెంట్‌ రెస్పాన్సిబిలిటీ (CER‌‌‌)కు కేటాయించాలని, దీనికి సంబంధించిన ప్రణాళికను కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయానికి అందచేయాలని సూచించింది.

ప్రాజెక్టును 3 లక్షల చదరపు మీటర్లలో అమలు చేయొచ్చని, ఇందులో మూడో వంతు, అంటే లక్ష చదరపు మీటర్లలో గ్రీన్‌ బెల్ట్‌‌‌‌ ఏర్పాటు తప్పనిసరని తెలిపింది.  ప్రాజెక్టు వ్యయం రూ. 570 కోట్లుగా అంచనా వేస్తుండగా, అందులో రూ. 35 కోట్లను కాలుష్య నియంత్రణ కోసం కేటాయిస్తున్నారు. కాలుష్య నియంత్రణ పరమైన నిర్వహణ కోసం ఏటా మరో రూ. 3.06 కోట్లను ఖర్చు చేయనున్నారు. IOC ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతంలో ప్రత్యక్షం గా 35 మందికి, పరోక్షంగా 460 మందికి ఉపాథి దొరకనుందని కూడా EAC తన నివేదికలో తెలిపింది.  రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ అంతకు ముందు 2017, డిసెంబర్లో ఈ ప్రాజెక్టును సిఫారసు చేసింది.

తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌‌‌‌ సెప్టెం బర్‌‌‌‌, 2018 లో పబ్లిక్‌‌‌‌ హియరింగ్‌ ను నిర్వహించింది. పబ్లిక్‌‌‌‌ హియరింగ్ సందర్భంగా, ఉపాథి కల్పన, ఆరోగ్య సదుపాయాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని EAC తెలిపింది. ఈ ప్రాజెక్టు స్థలం నుంచి పది కిలో మీటర్ల లోపల వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వంటివి ఏవీ లేవు. సైట్‌, లే అవుట్‌ ప్లాన్‌ కు పెట్రోలియమ్‌‌‌‌, ఎక్స్‌ ప్లో జివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (పెసో) నుంచి ముందస్తు అనుమతి తెచ్చుకోవాలని EAC సూచించిం ది. పెసో అనుమతి తర్వాత ఏవైనా మార్పులు చేస్తే, ఆ అనుమతిని మళ్లీ తాజాగా తెచ్చుకోవాల్సి వుంటుందని తెలిపింది EAC.

Latest Updates