నేటి నుండి పాత లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు
ఉత్సవాలకు సిద్దమైన పాతగుట్ట ఆలయం
ఆలయ విష్ణు పుష్కరిణి
భక్తుల కోసం సిద్దంగా ఉంచిన ప్రసాదాలు
ఆలయ ఈవో ఎన్​ గీతారెడ్డి

యాదగిరికొండ: యాదాద్రి ఆలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. 15‌‌-02-2019వ తేది నుండి 21‌‌-02-2019 వరకు వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో ఎన్​ గీతారెడ్డి తెలిపారు. ఉత్సవాల సమయంలో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున లడ్డు, పులిహోర లోటుతో ఇతర ఇబ్బందులు తలెత్తకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని అదేవిధంగా ఆయా శాఖల అధికారులకు సైతం ఆదేశాలు జారిచేశామని తెలిపారు. రోజు నిర్వహించే అలంకార సేవలకు వాహన సేవలను సిద్దం చేసినట్లు వివరించారు. స్వామివారి ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్దం దేవస్ధాన బస్సులతోపాటు ఆర్టీసీ వారి సహకారంతో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు వచ్చే రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల సహకారం తీసుకోనున్నట్లు ఈవో గీతారెడ్డి చెప్పారు.

ఉత్సవాల వివరాలు

15‌‌-02-2019  మాఘశుద్ద ఏకాదశి శుక్రవారం ఉ.9గం.లకు స్వస్తివాచనం, రక్షాబంధనం పుణ్యాహవాచనం. సా.6గం.లకు అంకురార్పణ, మత్య్సంగ్రహణం

16‌-02-2019 మాఘశుద్ద ద్వాదశి శనివారం ఉ.10 ద్వజారోహణం, వేదపారాయణం సా.6గం.లకు భేరీపూజ, దేవతాహ్వానము

17‌-02-2019 మాఘశుద్ద త్రయోదశి ఆదివారం ఉ.8గం.లకు అలంకార సేవ సింహవాహనము. సా.6గం.లకు హవనము రాత్రి 9గం.లకు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం

18‌-02-2019 మాఘశుద్ద చతుర్దశి సోమవారం ఉ.8గం.లకు హనుమంతవాహనము, రాత్రి 9 గం.లకు శ్రీవారి తిరు కల్యాణోత్సవము

19‌-02-2019 మాఘశుద్ద పౌర్ణమి మంగళవారం ఉ.8గం.లకు గరుడవాహన సేవ, రాత్రి 8గం.లకు స్వామి వారి దివ్యవిమాన రథోత్సవము

20-02-2019 మాఘశుద్ద బహుళ పాడ్యమి బుధవారం ఉ.10 గం.లకు పూర్ణాహుతి, మ.12గం.లకు చక్రతీర్ధం, సా.6గం.లకు దేవతోద్వాసన, శ్రీపుష్పయాగం, డోలారోహనం

21-02-2019 మాఘ బహుళ విదియ గురువారం ఉ.9గం.లకు శ్రీస్వామివారి శతఘటాభిషేకం, మ.1గంటకు మహదాశీర్వచనం, పండిత సన్మానంతో ఉత్సవాలు ముగుస్తాయి.

 

 

Latest Updates