జననేత వైఎస్ : ‘యాత్ర’ సిినిమా రివ్యూ

రన్ టైమ్: 2 గంటల 6 నిమిషాలు

నటీనటులు : మమ్ముట్టి, జగపతిబాబు, రావు రమేష్, సచిన్ కేద్కర్, సుహాసిని, కళ్యాణి తదితరులు

మ్యూజిక్: కె.కృష్ణ కుమార్

సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్

నిర్మాతలు: శశి దేవిరెడ్డి,విజయ్ చిల్ల

రచన,దర్శకత్వం: మహి రాఘవ్

రిలీజ్ డేట్: 2019,ఫిబ్రవరి 8

కథేంటి?

దివంగత సీఎం YS రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ జర్నీయే ఈ సినిమా. ఆయన చేసిన పాద యాత్రను బేస్ చేసుకొని తీసిన కథ. జనాల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకున్నాడు.? జనం సమస్యల కోసం పార్టీని కూడా లెక్క చేయకుండా సీఎం ఎలా అయ్యాడనేది ఈ సినిమా కథ.

 నటీనటుల పనితీరు:

ఈ సినిమాకు మేజర్ ప్లస్ మమ్ముట్టి. వై.ఎస్ పాత్రలో తను ఒదిగిపోయి నటించాడు. ఎక్కడా ఆయనను ఇమిటేట్ చేసినట్టుగా అనిపించకుండా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అందించాడు..తను చెప్పిన డబ్బింగ్ చాలా బాగా సూట్ అయ్యింది.ఇతర పాత్రల్లో జగపతిబాబు,రావు రమేష్, సుహాసిని,సచిన్ కేద్కర్ లు రాణించారు.

టెక్నీషియన్స్ వర్క్:

సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.. కె.కృష్ణ కుమార్ సాంగ్స్ ఫర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆర్ట్ వర్క్ అంతా బాగుంది.కొన్ని డైలాగులు బాగున్నాయి.

విశ్లేషణ:

బయోపిక్స్ అంటే సదరు వ్యక్తి గురించి పాజిటివ్సే చూపించాల్సి వస్తుంది.అయితే ‘‘యాత్ర’’ బయోపిక్ కాదని డైరెక్టర్ ముందే చెప్పాడు.కానీ చూసే వాళ్లకు ఇది బయోపిక్ లాగే కనిపిస్తుంది. వై.ఎస్ లోని పాజిటివ్ ఎక్కువ కనిపించింది. కాకపోతే ఇది కన్విన్సింగ్ గా చూపించాడు డైరెక్టర్. జనాల సమస్యలకు వై.ఎస్ స్పందించే సీన్లు బాగా ఎలివేట్ అయ్యాయి. వై.ఎస్ ప్రవేశపెట్టిన పథకాల వెనక స్టోరీని ఎమోషనల్ గా రాసుకున్నాడు డైరెక్టర్. అందులో కొన్ని కల్పితమే అయినా.. ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయి. ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఇవి బాగా వర్కవుట్ అయ్యాయి. ఇలాంటి సీన్లల్లో మమ్ముట్టి పరిణితితో కూడిన నటన కట్టిపడేస్తుంది. కొన్ని సార్లు ఓవర్ డ్రామాలా అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో అక్కడక్కడా స్లో పేస్ వల్ల షో రీల్ చూస్తున్నట్టనిపించినా.. పాద యాత్ర మొదలు పెట్టిన తర్వాత నచ్చుతుంది. ఇక ఎండ్ టైటిల్స్  వై.ఎస్ ముఖ్యమంత్రి అయినప్పటి సీన్లు, చనిపోయిన విజువల్స్ మీద ఓ ఎమోషనల్ సాంగ్ పెట్టారు. వీటికి వైఎస్ అభిమానులు బాగా కనెక్ట్ అవుతారు. ఓవరాల్ గా ‘‘యాత్ర’’ డీసెంట్ అటెంప్ట్.

Latest Updates