టీడీపీ ఎంఎల్‌సీ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి

టీడీపీ ఎంఎల్‌సీ నాగ జగదీశ్వర రావు ఇంటిపై వైసీపీ కార్యకర్తలు గురువారం దాడి చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తన ఇంటిపై గురువారం దాడి చేశారని ఆరోపిస్తూ టీడీపీ ఎంఎల్‌సి బుద్ధ నాగ జగదీశ్వర రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు వికేంద్రీకరణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చినందున తనను లక్ష్యంగా పెట్టుకున్నారని విశాఖ డీఎస్పీ బాబూజీకి ఇచ్చిన ఫిర్యాదులో బుద్ధ పేర్కొన్నారు.

వైసీపీ కార్యకర్తలు తన ఇంటి ముందు పలు నినాదాలు చేసి, తన దిష్టిబొమ్మను తగలబెట్టారని రావు ఆరోపించారు. ఎమ్మెల్సీ బుద్ధ పై దాడి చేయడం దురదృష్టకరమని టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ దువ్వాడ రామారావు అన్నారు. వైసీపీ కార్యకర్తలు చేసిన ఈ దాడిన ఆయన పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
‘మా నాయకుడు చంద్రబాబు నాయుడు విశాఖను గణనీయంగా అభివృద్ధి చేశారు. మా పార్టీ విశాఖపట్నం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. విశాఖపట్నంలో వ్యవస్థల వికేంద్రీకరణకు వ్యతిరేకం’ అని రామారావు అన్నారు.

For More News..

నెటిజన్లకు గుడ్‌న్యూస్.. రూపాయికే 1జీబీ డేటా

25 లక్షల మందికి ఇళ్ల జాగాలు

Latest Updates