బోండా ఉమ,బుద్ధా వెంకన్న కారుపై YCP కార్యకర్తల దాడి

TDP నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై YCP కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఈ ఘటన జరిగింది. టీడీపీ నేతలు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో.. YCP కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
TDP అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా YCP కార్యకర్తలు అడ్డుకుంటోందనే వార్తలతో… విషయం తెలుసుకునేందుకు వీరిద్దరూ మాచర్లకు వచ్చారు. ఈ సందర్భంలో వారిపై దాడి జరిగింది. పెద్ద కర్రతో ఓ వ్యక్తి కారు అద్దాలను పగలగొట్టాడు. అయితే డ్రైవర్ కారును ఆపకుండా అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కూడా వారి వాహనాన్ని వెంటాడే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో ఇద్దరు నేతలకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Latest Updates