ఎదుటి వారు బాగుంటే చంద్రబాబు ఓర్వలేరు: మోహన్ బాబు

YCP leader Mohanbabu fires on AP CM Chandrababu nayudu

అమరావతి, వెలుగు: తెలంగాణను సీఎంకేసీఆర్​ అభివృద్ధి చేస్తున్నారని, అలాగే ఏపీని బాగు చేయడానికి చంద్రబాబు ప్రయత్నించాలని సినీ నటుడు మోహన్ బాబు సూచించారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ లోఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఉదయం నుంచి సాయంత్రం వరకు జగన్, కేసీఆర్, మోడీలను తిట్టడంతోనే సరిపోతోందని, ఇప్పటికైనా అనవసర అహంకారాన్ని వదిలి నిజాలు మాట్లాడాలని హితవు పలికారు. బాబు కంటే ముందు తెలుగుదేశంపార్టీలో చేరింది తానేనన్నారు. ‘‘ఎదుటి వారు బాగుంటే చంద్రబాబు ఓర్వలేరు. అందుకే టీడీపీని లాక్కు ని మోసం చేశారు. ఏపీఅప్పుల్లో మునిగిపోవడానికి కారణం కూడా చంద్రబాబే” అని ఆరోపించారు. జగన్ పైఉన్న కేసుల గురించి చంద్రబాబు మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలని, ఆయన తనపై ఉన్న కేసుల్లో స్టేలు తెచ్చుకుని లాబీయింగ్​లు చేస్తున్నారన్నారు. బాబు ఎన్ని యూటర్న్​లైనా తీసుకుంటారని ఎద్దేవా చేశారు. మోడీ ఆంధ్రాకు వస్తే బేడీలు వేస్తానన్న చంద్రబాబు.. నాలుగేళ్లు పొత్తు ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. కేంద్రం విడుదల చేసిన నిధులకు లెక్కలు ఎందుకు చెప్పలేకపోతున్నా-రని నిలదీశారు. పసుపు–కుం కుమ పేరుతోఇస్తున్న డబ్బు ఈ ఐదేళ్లలో దోచుకుందేనని ఆరోపించారు.

Latest Updates