బాబు పాక్ ను సమర్థించడం దిగజారుడు రాజకీయం : రోజా

ఉగ్రదాడిపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్లను తప్పుపడుతున్నారు ప్రతిపక్ష నేతలు. ఉగ్రదాడిని దేశమంతా ఖండిస్తుంటే.. చంద్రబాబు మాత్రం పాకిస్థాన్ చర్యను సమర్థిస్తూ.. ప్రధానమంత్రి మోడీ రాజీనామా చేయాలనటం సిగ్గుచేటు అన్నారు YCP ఎమ్మెల్యే  రోజా. ఉదయం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రోజా….బాబువి దిగజారుడు రాజకీయాలన్నారు. పుష్కరాలలో 30 మంది చనిపోతే బాబు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. మోడీ, కేసీఆర్, జగన్ కుట్రలు చేస్తే TDPలో ఏ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఉండే పరిస్థితి లేదన్నారు. దళితులపై చింతమనేని చేసిన వాఖ్యలపైనా ఆమె సీరియస్ అయ్యారు.