లోకేష్ కు మందబుద్ధి..చంద్రబాబుకు చిన్నమెదడు చితికింది : ఎమ్మెల్యే రోజా

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు చిన్నమెదడు చితికిపోయిందంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

మాజీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడడం బాధగా ఉందన్నారు వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ విదేశాల్లో చదువుకున్నాడని గొప్పలు చెప్పుకుంటారన్నారు. కానీ లోకేష్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రామో, దేశమో తెలియకుండా కాన్ఫిరెన్స్ లో మాట్లాడారని గుర్తు చేశారు. వర్ధంతికి,జయంతికి తేడా తెలియని లోకేష్..విదేశాల్లో చదువుకున్నాడని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలోకి దిగిన లోకేష్ కు మంగళగిరిని మందలగిరిగా మార్చిన మంద బుద్ధిగల లోకేష్ సీఎం జగన్ గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటని రోజా అసెంబ్లీలో మాట్లాడారు.

ప్రతిపక్ష నేతలు రైతులపై ఉన్న ప్రేమతో ఉల్లిదండలతో అసెంబ్లీకి వచ్చారని..ఆ ఉల్లిగడ్డలు హెరిటేజ్ నుంచి తెచ్చారా..? లేదా అని రోజా ప్రశ్నించారు. రైతులు గురించి మాట్లాడే అవకాశం ఇస్తే టీడీపీ నేతలు అసెంబ్లీ భయట తిరుగుతున్నారని, బాధ్యతగల వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారన్నారు.

ప్రతిపక్ష పార్టీ నేతలు అసెంబ్లీకి వచ్చేది సమస్యల్ని పరిష్కరించేందుకు కాదని..అసెంబ్లీలో లొల్లి చేసేందుకు ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి వస్తున్నారని రోజా అన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90శాతం మంది రైతులు అప్పులు పాలైంది నిజం కాదా..?రైతులు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు.

రైతుల విషయంలో  వైఎస్ రెండడుగులు ముందుకేస్తే ఆయన  కుమారుడు జగన్ నాలుగడుగులు ముందుకేసి  4సంవత్సరాలు ఇస్తానన్న రైతు భరోసాను ఐదు సంవత్సరాలు ఇచ్చేలా పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. వయసులో తనకంటే చిన్నవాడైన జగన్ ను చంద్రబాబు పెద్దమనసుతో ఆశీర్వదించాల్సిందిపోయి వీధిరౌడిలా మాట్లాడడం చాలా సిగ్గుచేటన్నారు.

ఉల్లిపాయల కోసం సామిరెడ్డి అనే వ్యక్తి చనిపోయాడంటూ చంద్రబాబు అసెంబ్లీలో అసత్యాలు పలికారని, అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  చంద్రబాబు మాటలు చూస్తుంటే ఆయన చిన్న మెదడు చితిపోయినట్లు స్పష్టంగా అర్ధమవుతుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Latest Updates