తప్పులేకుండా ఆ 3 మాటలు చెప్పు.. లోకేశ్‌కు వైసీపీ ఎమ్మెల్యే సవాల్

ycp-mla-sudhakar-babu-counter-to-nara-lokesh

మాజీ మంత్రి లోకేశ్ ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా తెలుగు పదాలు కూడా పలకలేని వ్యక్తి సీఎం జగన్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓడిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేశ్ లకు బుద్ధి రాలేదని.. జగన్ విజయాన్ని వారు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో వారు చేసిన అవినీతిని అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామన్నారు.

వైసీపీ ప్రభుత్వంపై, రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనవసర ఆరోపణలు చేస్తున్న లోకేశ్.. దయచేసి తెలుగు నేర్చుకోవాలని హితవు పలికారు. ఆయన తెలుగు తెలుసననుకుంటే.. గుంటూరు, మంగళగిరి, డెంగ్యూ పదాలను పలకాలన్నారు. ఆయన మూడు పదాలను వరుసపెట్టి పలకలగలిగితే.. లోకేష్‌ను చంద్రబాబుకు నిజమైన రాజకీయ వారసుడిగా ఒప్పుకుంటామని సుధాకర్ బాబు అన్నారు.

Latest Updates